ePaper
Saturday, November 21, 2026
ePaper
Homeఅర్జున్ సమాచారంతల్లి సావిత్రీ దేవికి కన్నీటి వీడ్కోలు - ఉత్తరాఖండ్‌లోని పంచూర్ గ్రామంలో తల్లి పాడె మోసిన...

తల్లి సావిత్రీ దేవికి కన్నీటి వీడ్కోలు – ఉత్తరాఖండ్‌లోని పంచూర్ గ్రామంలో తల్లి పాడె మోసిన సీఎం – 91 ఏళ్ల వయసులో శుక్రవారం కన్నుమూసిన సావిత్రీ దేవి – అమ్మను మించిన రక్షణ, ప్రేమ లేవంటూ యోగి భావోద్వేగ పోస్ట్ – హరిద్వార్‌లోని చండీ ఘాట్‌లో అంత్యక్రియలు

📰 Generate e-Paper Clip

ఉత్తరాఖండ్‌: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తన తల్లి సావిత్రీ దేవి అంత్యక్రియల్లో పాల్గొని కన్నీటి వీడ్కోలు పలికారు. ఉత్తరాఖండ్‌లోని పౌరీ గఢ్వాల్ జిల్లా పంచూర్ గ్రామంలోని తమ పూర్వీకుల నివాసంలో శనివారం ఆమె పార్థివ దేహానికి నివాళులర్పించారు. అమ్మ ప్రేమతో సమానమైనది ఈ సృష్టిలో ఏదీ లేదంటూ భావోద్వేగానికి లోనయ్యారు. తల్లి భౌతికకాయానికి పుష్పాంజలి ఘటించిన సీఎం యోగి, స్వయంగా పాడే మోశారు. ఈ సందర్భంగా ‘ఎక్స్’ వేదికగా యోగి ఆదిత్యనాథ్ స్పందిస్తూ.. తల్లిని మించిన నీడ, ఆశ్రయం, రక్షణ, ప్రేమ మరేదీ లేదని పేర్కొన్నారు. 91 ఏళ్ల సావిత్రీ దేవి శుక్రవారం ఉదయం 11 గంటల సమయంలో స్వగ్రామంలో కన్నుమూశారు. ఆ సమయంలో లక్నోలో అధికారిక కార్యక్రమంలో ఉన్న సీఎం యోగి, విషాదాన్ని దిగమింగుకుని షెడ్యూల్ ప్రకారం కార్యక్రమాలను పూర్తి చేసుకున్నారు. అనంతరం ఉత్తరాఖండ్‌లోని స్వగ్రామానికి చేరుకుని కడసారి వీడ్కోలు పలికారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!