ఆపదలో ఉన్న కుటుంబానికి అండగా గ్రామ సభ్యులు.. రూ.12 వేల ఆర్థిక సహాయం అందజేత…
అర్జున్ సమాచారం, నవంబర్ 23,రామగిరి రిపోర్టర్.
రామగిరి మండలం రాజాపూర్ గ్రామానికి చెందిన కీర్తిశేషులు సంగే చంద్రమ్మ అనారోగ్యంతో మృతి చెందడంతో, ఆమె కుటుంబానికి అండగా నిలిచేందుకు గ్రామ సభ్యులు మానవత్వాన్ని చాటుకున్నారు. గ్రామ ప్రజలు స్వచ్ఛందంగా విరాళాలు సేకరించి బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేశారు.
గ్రామ ఉపసర్పంచ్ కలవేన శ్రీకాంత్ ముదిరాజ్ ఆధ్వర్యంలో సేకరించిన రూ.12,000 నగదును మృతురాలి కుమారులు సంగే రాజ్ కుమార్, సంగే సాగర్‌లకు అందజేశారు.
ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు కలవేన స్వరూప, రమేష్, గ్రామస్తులు వేముల ప్రశాంత్, రాజమల్లు, నరేష్ తదితరులు పాల్గొన్నారు.
ఆపద సమయంలో బాధిత కుటుంబానికి అండగా నిలిచిన గ్రామ సభ్యుల సేవలను పలువురు అభినందించారు.

