సేవా కార్యక్రమాలతో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ జన్మదిన వేడుకలు…
ప్రభుత్వ వసతి గృహాల విద్యార్థులకు, ఆసుపత్రి రోగులకు పండ్ల పంపిణీ..
అర్జున్ సమాచారం ,నవంబర్ 23 .మంథని రిపోర్టర్.
స్వేరోస్ ఇంటర్నేషనల్ ఫౌండర్ చైర్మన్, ఐపీఎస్ అధికారి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ 60వ జన్మదినాన్ని పురస్కరించుకుని పెద్దపల్లి జిల్లా స్వేరోస్ ఇంటర్నేషనల్ కమిటీ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. మంథని, పెద్దపల్లి ప్రాంతాల్లోని ప్రభుత్వ వసతి గృహాల్లో విద్యార్థులకు, మంథని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు పండ్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా స్వేరోస్ ఇంటర్నేషనల్ రాష్ట్ర నాయకులు కౌండిన్య శ్రీశైలం, మహాదేవ్ గురూజీ, స్వేరోస్ మాజీ జిల్లా నాయకులు మచ్చ రాహుల్, పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు మల్లారం మహేందర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత స్థానాలను అధిరోహిస్తూ పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి మరింతగా కృషి చేయాలని ఆకాంక్షించారు. ఆయన జన్మదినాన్ని సేవా కార్యక్రమాల ద్వారా జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు.
అనంతరం ముఖ్య అతిథిగా హాజరైన పుట్ట మధుకర్ సమక్షంలో శ్రీశైలం, మహాదేవ్ గురూజీ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో శ్యాంసుందర్, శివయ్య, సురేందర్, రాజు, శ్రీ వర్ధన్ తదితర స్వేరోస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

