బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థి ఆత్మహత్య.
నిర్మల్: అర్జున్ సమాచారం డెస్క్ నవంబర్ 24.
నిర్మల్ జిల్లా బాసర ఆర్జీయూకేటీలో విషాదం నెలకొంది. గోదావరి బ్లాక్ హాస్టల్ గదిలో ఉరేసుకుని సీఎస్ఈ విద్యార్థి సంపత్ (20) ఆత్మహత్య చేసుకున్నాడు.మృతుడు సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లికి
చెందినవాడు. సోమవారం రాత్రి 8.30 గంటల సమయంలో ఘటన జరిగింది. భోజనానికి వెళ్లిన సహచర విద్యార్థులు తిరిగొచ్చేసరికి విగతజీవిగా సంపత్ పడివున్నాడు. వెంటనే బైంసా ప్రభుత్వ
ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు.

