హైదరాబాద్,అర్జున్ సమాచారం:
దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో బౌరంపేటలో అక్రమంగా గ్యాస్ సిలిండర్ల నుంచి గ్యాస్ చోరీ చేస్తున్న ముఠా గుట్టును స్థానికులు రట్టు చేశారు. సతీష్ సొసైటీలోని ఓ రహస్య గోదాంలో డెలివరీ బాయ్స్ సిలిండర్ల నుంచి గ్యాస్ తీస్తుండగా గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న దుండిగల్ పోలీసులు 86 హెచ్‌పీ గ్యాస్ సిలిండర్లతో పాటు మూడు ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. ప్రాథమిక విచారణలో ఈ వ్యవహారం నిజాంపేట్‌కు చెందిన శ్రీ లలిత గాయత్రి హెచ్‌పీ గ్యాస్ ఏజెన్సీకి సంబంధించి ఉన్నట్లు గుర్తించారు. ఎస్‌ఐ రంజిత్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
========================
బౌరంపేటలో గ్యాస్ సిలిండర్ల నుంచి గ్యాస్ చోరీ 86 సిలిండర్లు, మూడు ఆటోలు స్వాధీనం నిజాంపేట్‌కు చెందిన హెచ్‌పీ గ్యాస్ ఏజెన్సీపై పోలీసుల దర్యాప్తు
RELATED ARTICLES

