ePaper
Friday, August 14, 2026
ePaper
Homeతెలంగాణప్రజాబాట కార్యక్రమంలో విద్యుత్ భద్రతపై విస్తృత అవగాహన

ప్రజాబాట కార్యక్రమంలో విద్యుత్ భద్రతపై విస్తృత అవగాహన

📰 Generate e-Paper Clip

హుజురాబాద్ టౌన్, జూన్ 30, అర్జున్ సమాచారం :
హుజూరాబాద్ డివిజన్ పరిధిలోని హుజూరాబాద్ టౌన్ సెక్షన్‌లో మంగళవారం నిర్వహించిన ‘ప్రజాబాట’ కార్యక్రమంలో విద్యుత్ భద్రతపై వినియోగదారులు, వ్యవసాయదారులకు విస్తృత అవగాహన కల్పించామని కరీంనగర్ డీఈ (టెక్నికల్ అండ్ సేఫ్టీ) శ్రీ ఉపేందర్ తెలిపారు.
ఈ సందర్భంగా విద్యుత్ సిబ్బందికి విధి నిర్వహణలో ప్రతి ఉద్యోగి ‘వన్ మినిట్ సేఫ్టీ’ సూత్రాన్ని తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ప్రతి పని ప్రారంభించే ముందు ప్రమాదాలను అంచనా వేసి, అవసరమైన భద్రతా చర్యలు తీసుకోవడం ద్వారా ప్రమాదాలను పూర్తిగా నివారించవచ్చని వివరించారు.
వ్యవసాయ విద్యుత్ వినియోగదారులు ఎట్టి పరిస్థితుల్లోనూ స్వయంగా ఫ్యూజ్‌లు మార్చేందుకు ప్రయత్నించవద్దని, ఏవైనా లోపాలు తలెత్తినప్పుడు వెంటనే 1912 టోల్ ఫ్రీ నంబర్కు సమాచారం అందించాలని సూచించారు.
వ్యవసాయ మోటార్లకు అదనపు లోడ్లు ఉపయోగిస్తున్న రైతులు 5 హెచ్‌పీ నుంచి 7.5 హెచ్‌పీ వరకు అదనపు లోడ్లను నిబంధనల ప్రకారం క్రమబద్ధీకరించుకోవాలని అవగాహన కల్పించారు.
అదేవిధంగా, విద్యుత్ సరఫరా నాణ్యతను మెరుగుపరచడం, ప్రమాదాల నివారణ లక్ష్యంగా పొడవైన విద్యుత్ లైన్లపై మధ్య స్తంభాల ఏర్పాటు, దెబ్బతిన్న షార్ట్ పోల్స్ మార్పిడి, వదులుగా ఉన్న వైర్ల (లూజ్ స్పాన్లు) సరిదిద్దడం, తక్కువ ఎత్తులో ఉన్న విద్యుత్ స్తంభాల ప్లింత్‌లను ఎత్తు పెంచడం, వ్యవసాయ మోటార్లకు కెపాసిటర్లు ఏర్పాటు చేయడం వంటి అంశాలపై అధికారులకు అవసరమైన సూచనలు చేశా

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!