ePaper
Friday, August 14, 2026
ePaper
Homeతెలంగాణఇందిరా మహిళా శక్తితో ఆర్థిక ప్రగతి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లతో ఎస్ హెచ్...

ఇందిరా మహిళా శక్తితో ఆర్థిక ప్రగతి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లతో ఎస్ హెచ్ జీ మహిళల ఉపాధికి మార్గం జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ తంగళ్ళపల్లిలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

📰 Generate e-Paper Clip

రాజన్న సిరిసిల్ల ,జూలై -03,అర్జున్ సమాచారం :
ఇందిరా మహిళా శక్తి యూనిట్లు మహిళా సంఘాల ఆర్థిక ప్రగతికి దోహదపడుతున్నాయని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు. ఇందిరా మహిళా శక్తి కింద తంగళ్ళపల్లి మండల కేంద్రంలో స్వయం సహాయక సంఘాల (ఎస్ హెచ్ జీ) మహిళలు వెంకటసాయి కోల్డ్ ప్రెస్ ఆయిల్ & ఫ్లోర్ మిల్ యూనిట్, కోవిదా మిల్క్ పాయింట్ ఏర్పాటు చేసుకోగా,  జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ శుక్రవారం ప్రారంభించారు. వాటి పని తీరు, ఉపాధి, ఆదాయం తదితర వివరాలను మహిళలను జిల్లా కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. ఇందిరా మహిళా శక్తి కింద రెండు యూనిట్లు ప్రారంభించామని తెలిపారు. ఒక యూనిట్లో కోల్డ్ ప్రెస్సింగ్ ఆయిల్, పిండి గిర్ని, ఇతర దాదాపు ఆరు యంత్రాలు ఏర్పాటు చేశారని తెలిపారు. దాదాపు రూ. 11 లక్షల 50 వేలతో యూనిట్ ప్రారంభించారని వివరించారు దీనికి పీ ఎం ఎఫ్ ఎం ఈ కింద రూ . 3 లక్షల 50 వేల సబ్సిడీ అందుతుందని వెల్లడించారు. అలాగే మరో మహిళ డైరీ యూనిట్ ను ఏర్పాటు చేసుకున్నారని, దీనికి మహిళా సంఘాల నుంచి దాదాపు రూ.5 లక్షల రుణం ఇప్పించామని తెలిపారు. ఇక్కడ ఇతర డైరీ ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. జిల్లాలో ఇలాంటి మరిన్ని యూనిట్లు ఏర్పాటు చేసేందుకు మహిళలు ముందుకు రావాలని పిలుపు నిచ్చారు. యూనిట్లు ఏర్పాటు చేయడంతో ఉపాధితోపాటు మహిళా సాధికారతకు దోహదం చేస్తుందని వివరించారు.  నిన్న బ్యాంకర్ల సమావేశంలో ఇదే విషయంపై చర్చించి.. మహిళా సంఘాలకు రుణాలు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశామని తెలిపారు.జిల్లాలోని గ్రామీణ మహిళా, పురుష అభ్యర్థులకు ఉచిత రెసిడెన్షియల్ శిక్షణ సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఆర్ సేథీ (R SETI) ఆద్వర్యంలో అందుబాటులో ఉందని వెల్లడించారు. శిక్షణను యువత సద్వినియోగం చేసుకోవాలని, ఆర్థికంగా రాణించేందుకు వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపు నిచ్చారు.కార్యక్రమంలో డీఆర్డీఓ లక్ష్మీనారాయణ, లీడ్ డిస్ట్రిక్ మేనేజర్ మల్లికార్జున రావు, ఏఎంసీ వైస్ చైర్మెన్ నర్సింగం, ఇంచార్జి తహసీల్దార్ మురళి, ఇంచార్జి ఎంపీడీఓ రమేష్, ఎంపీఓ మీర్జా, సర్పంచ్ లక్మీరాజం, తదితరులు పాల్గొన్నారు.
===========================

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!