ePaper
Tuesday, July 7, 2026
ePaper
Homeతెలంగాణహైదరాబాద్జూలై 17,18,19 తేదీల్లో బాగేశ్వర్ సర్కార్ శ్రీ ధీరేంద్ర కృష్ణ శాస్త్రి దివ్య దర్బార్ ...

జూలై 17,18,19 తేదీల్లో బాగేశ్వర్ సర్కార్ శ్రీ ధీరేంద్ర కృష్ణ శాస్త్రి దివ్య దర్బార్ భక్తుల కోసం మూడు రోజుల పాటు శ్రీ హనుమాన్ కథ హైదరాబాద్‌లో తొలిసారి బాగేశ్వర్ సర్కార్ శ్రీ ధీరేంద్ర కృష్ణ శాస్త్రి కార్యక్రమం బ్రోచర్ ఆవిష్కరించిన హైదరాబాద్ బాగేశ్వర్ ధామ్ సేవా సమితి సభ్యులు

📰 Generate e-Paper Clip

హైదరాబాద్‌,అర్జున్ సమాచారం:
జూలై 17, 18, 19 తేదీల్లో బాగేశ్వర్ సర్కార్ శ్రీ ధీరేంద్ర కృష్ణ శాస్త్రి దివ్య దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా  భక్తుల కోసం మూడు రోజుల పాటు  శ్రీ హనుమాన్ కథ ఉంటుంది. హైదరాబాద్‌లో  తొలిసారి బాగేశ్వర్ సర్కార్ శ్రీ ధీరేంద్ర కృష్ణ శాస్త్రి  కార్యక్రమం నిర్వహించనున్నారు. బాగేశ్వర్ సర్కార్ శ్రీ ధీరేంద్ర కృష్ణ శాస్త్రి తొలిసారిగా హైదరాబాద్‌లో నిర్వహించనున్న మూడు రోజుల  కార్యక్రమాల కోసం సోమవారం  భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇందుకు సంబంధించిన బ్రోచర్ ను విడుదల చేశారు.  ఈ కార్యక్రమంలో ముఖ్య నిర్వాహకులు అంజనీ కుమార్ అగర్వాల్, సూర్య కమల్ గుప్తా, సంజయ్ అగర్వాల్, రాకేష్ జలాన్, రాకేష్ నర్సింగ్‌పురియా, సందీప్ మిత్తల్, ఘనశ్యామ్ అగర్వాల్, నవీన్ అగర్వాల్, పవన్ తిబ్రేవాల్, అంకిత్ అగర్వాల్, ధీరజ్ అగర్వాల్, రూపేష్ అగర్వాల్, శుభమ్ అగర్వాల్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాలు జూలై 17, 18, 19 తేదీలలో గగన్ పహాడ్‌లోని పురాన్ సన్స్ ఫార్మ్స్  (ప్రెస్టీజ్ సిటీ గేట్ ఎదురుగా) జరగనున్నాయి. ఈ మహత్తర ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని  హైదరాబాద్ బాగేశ్వర్ ధామ్ సేవా సమితి  ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన స్వచ్ఛంద సేవకుల సమావేశంలో కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు పాటించాల్సిన నియమాలు, సేవా విధానాలు, బాధ్యతల గురించి వారికి విపులంగా వివరించారు.  పురాన్ సన్స్ ఫార్మ్స్‌లో పండిత్ సంజయ్ శర్మ ఆధ్వర్యంలో భూమిపూజ కార్యక్రమం వైభవంగా జరిగింది. అనంతరం జరిగిన స్వచ్ఛంద సేవకుల సమావేశంలో కన్వీనర్ అంజనీ కుమార్ అగర్వాల్ మాట్లాడుతూ   హైదరాబాద్‌లో ఇంతటి భారీ స్థాయిలో ఈ తరహా ఆధ్యాత్మిక కార్యక్రమం తొలిసారిగా నిర్వహించబడుతోందన్నారు. అందరూ సమష్టిగా కృషి చేసి ఈ కార్యక్రమాన్ని చారిత్రాత్మక విజయంగా నిలపాలని ఆయన పిలుపునిచ్చారు. బాగేశ్వర్ ధామ్ నుంచి 60 మంది సభ్యుల బృందం, అలాగే ఇతర ప్రాంతాల నుంచి 500 మంది రానున్నారని, వారికి వసతి, భోజన ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. జూలై 16 నుంచి 19 వరకు స్వచ్ఛంద సేవకులు విధుల్లో ఉండాలని సూచించారు. సేవలందించిన ప్రతి స్వచ్ఛంద సేవకునికి ‘బాబా’ తరపున ప్రత్యేక ప్రశంసాపత్రం (సర్టిఫికేట్) అందిస్తామన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!