ePaper
Saturday, August 22, 2026
ePaper
Homeతెలంగాణకరీంనగర్బూరుగుపల్లి గ్రామానికి చెందిన ఆరుగురు లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను అందజేసిన...

బూరుగుపల్లి గ్రామానికి చెందిన ఆరుగురు లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను అందజేసిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

📰 Generate e-Paper Clip

చొప్పదండి,ని.వ{గంగాధర మండలం},అర్జున్ సమాచారం:

తెలంగాణ రాష్ట్రంలోని పేద, మధ్య తరగతి ప్రజల సొంతింటి కలను నిజం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని, ఇందిరమ్మ ఇండ్లతో నిరుపేదల జీవితాల్లో ప్రభుత్వం వెలుగులు నింపుతోందని చొప్పదండి నియోజకవర్గం ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. గంగాధర ప్రజా కార్యాలయంలో సోమవారం కరీంనగర్ జిల్లా గంగాధర మండలం బూరుగుపల్లి  గ్రామానికి చెందిన ఆరుగురు లబ్ధిదారులకు  ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను చొప్పదండి నియోజకవర్గం ఎమ్మెల్యే డా మేడిపల్లి సత్యం అందజేశారు. బూరుగుపల్లి గ్రామానికి చెందిన అన్నాల్దాస్ లలిత,విలసాగర్ లక్ష్మీ,దూలం కవిత,జోగుల సత్తవ్వ,గడ్డం నవీన,పైడ్ల మల్లమ్మ పలువురు లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను అందజేశారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందని పేర్కొన్నారు. చొప్పదండి నియోజకవర్గంలో  ఇప్పటికే 3,500 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసినట్టు తెలిపారు. రానున్న రోజుల్లో  మరో 2000 ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయించి  ఇండ్లు లేని వారికి కేటాయిస్తామని పేర్కొన్నారు.చొప్పదండి నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడానికి కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. గత బిఆర్ఎస్ పాలనలో  నిరుపేదల కోసం ఒక్కటంటే ఒక్కటి కూడా కట్టించలేదని గుర్తు చేశారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పేరుతో నాటి కెసిఆర్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, ఇచ్చిన మాట ప్రకారం అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ఇండ్లు రాని నిరుపేదలు ఆందోళన చెందవద్దని, రానున్న రోజుల్లో అర్హులైన ప్రతి ఒక్కరికి  ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో తహసిల్దార్ అంబటి రజిత, ఎంపీడీవో రామ్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మంత్రి మహేందర్, స్థానిక సర్పంచ్ దూలం కళ్యాణ్ కుమార్ గౌడ్,బిర్ల ఆనందం, సాగి అజయ్ రావు, దూల వీరేశం,అత్తాపురం తిరుపతి, రాచమల్ల భాస్కర్, కాంగ్రెస్ నాయకులు కడారి కనుకయ్య, రెండ్ల రాజిరెడ్డి, గుండ వేణి తిరుపతి, ఆరే రాజశేఖర్, వేముల అంజి, బైరి శేట్టి సంపత్, దాతు అంజి, ఐలయ్య, తదితరులు పాల్గొన్నారు.
===========================

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!