ePaper
Tuesday, July 7, 2026
ePaper
Homeతెలంగాణకరీంనగర్అల్ఫోర్స్ ఉమెన్స్ డిగ్రీ & పీజీ కళాశాలకు జాతీయ స్థాయి "బెస్ట్ ప్లేస్‌మెంట్ అండ్ కెరీర్...

అల్ఫోర్స్ ఉమెన్స్ డిగ్రీ & పీజీ కళాశాలకు జాతీయ స్థాయి “బెస్ట్ ప్లేస్‌మెంట్ అండ్ కెరీర్ డెవలప్‌మెంట్ అవార్డు–2026”

📰 Generate e-Paper Clip

కరీంనగర్,అర్జున్ సమాచారం:

కరీంనగర్‌కు చెందిన అల్ఫోర్స్ ఉమెన్స్ డిగ్రీ & పీజీ కళాశాల జాతీయ స్థాయి “బెస్ట్ ప్లేస్‌మెంట్ అండ్ కెరీర్ డెవలప్‌మెంట్ – ఎడ్యుకేషన్ ఐకాన్ అవార్డు– 2026″ను సొంతం చేసుకుంది. గురుగ్రామ్‌లో నిర్వహించిన ఎడ్యుకేషన్ ఐకాన్ అవార్డ్స్–2026 కార్యక్రమంలో కళాశాల చైర్మన్ వూటుకూరి రవీందర్ రెడ్డి ఈ అవార్డును స్వీకరించారు. ఏసిఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మాజీ భారత క్రికెటర్ సందీప్ పాటిల్ చేతుల మీదుగా అవార్డును అందజేశారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య, పరిశ్రమలకు అనుగుణమైన నైపుణ్యాభివృద్ధి, ఉత్తమ ప్లేస్‌మెంట్ అవకాశాలు కల్పిస్తున్నందుకు గుర్తింపుగా ఈ అవార్డు లభించింది. ఈ సందర్భంగా చైర్మన్ వూటుకూరి రవీందర్ రెడ్డి మాట్లాడుతూ, విద్యార్థుల సమగ్రాభివృద్ధి, నాణ్యమైన విద్య, అత్యుత్తమ కెరీర్ అవకాశాల కల్పనకు మరింత అంకితభావంతో కృషి చేస్తామని తెలిపారు. అవార్డు లభించిన సందర్భంగా కళాశాల అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు చైర్మన్‌కు అభినందనలు తెలియజేశారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!