ePaper
Friday, August 14, 2026
ePaper
Homeతెలంగాణములుగుఈవీఎం గోదాంను తనిఖీ చేసిన కలెక్టర్

ఈవీఎం గోదాంను తనిఖీ చేసిన కలెక్టర్

📰 Generate e-Paper Clip

ములుగు,అర్జున్ సమాచారం:
ఈవీఎం గోదాం ను జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు  నెలవారి తనిఖీ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు కలెక్టరేట్ ఆవరణలోని ఈవీఎం గోదాంను గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో నెలవారి తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో గోదాం సీల్ ను పరిశీలించారు.గోదాంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరు, అగ్నిప్రమాదాల నివారణ కోసం ఏర్పాటు చేసిన ఫైర్ ఎక్స్టింగ్విషర్లు, ఇతర భద్రతా పరికరాలను తనిఖీ చేశారు.
అత్యవసర పరిస్థితులు తలెత్తిన సందర్భంలో అనుసరించాల్సిన భద్రతా చర్యలపై సంబంధిత సిబ్బందికి సూచనలు చేశారు. గోదాం వద్ద ఏర్పాటు చేసిన పోలీసు బందోబస్తు, భద్రతా రిజిస్టర్లు, సందర్శకుల నమోదు పుస్తకాలను పరిశీలించారు. ఈవీఎంల భద్రత విషయంలో ఎటువంటి అలసత్వం ప్రదర్శించరాదని భద్రతా సిబ్బందిని ఆదేశించారు.
===================

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!