ePaper
Sunday, October 4, 2026
ePaper
Homeతెలంగాణఈ నెల 5న మండల యాదవ సంఘం సమావేశం.నూతన మండల కమిటీ ఏర్పాటు

ఈ నెల 5న మండల యాదవ సంఘం సమావేశం.నూతన మండల కమిటీ ఏర్పాటు

📰 Generate e-Paper Clip

ఈ నెల 5న మండల యాదవ సంఘం సమావేశం.నూతన మండల కమిటీ ఏర్పాటు

అర్జున్ సమాచారం // అక్టోబర్ 3 // ముత్తారం రిపోర్టర్.

ముత్తారం మండల యాదవ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 5న మండల సమావేశం నిర్వహించనున్నట్లు మండల యాదవ సంఘం అధ్యక్షుడు కాసు తిరుపతి యాదవ్ తెలిపారు.

శనివారం ముత్తారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సోమవారం మండల కేంద్రంలోని వెంకటలక్ష్మి ఫంక్షన్ హాల్‌లో మండల యాదవ సంఘం సమావేశం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ సమావేశంలో మండల యాదవ సంఘం నూతన కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

మండలంలోని యాదవ సంఘం సభ్యులు, నాయకులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని సమావేశాన్ని విజయవంతం చేయాలని కాసు తిరుపతి యాదవ్ పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో యాదవ సంఘం నాయకులు బక్కతట్ల కుమార్ యాదవ్, చెలకల జితేందర్ యాదవ్, పెగడ కుమార్ యాదవ్, నూనెటి కృష్ణ యాదవ్, తాత బాలు యాదవ్, జంగ కుమార్ యాదవ్, సింగనవేన సదయ్య యాదవ్, అంబటి చంద్రమౌళి యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!