ePaper
Tuesday, August 18, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్అమరావతిఏఆర్ కానిస్టేబుల్ మరియదాస్ మృతిపై హోంమంత్రి అనిత దిగ్భ్రాంతి

ఏఆర్ కానిస్టేబుల్ మరియదాస్ మృతిపై హోంమంత్రి అనిత దిగ్భ్రాంతి

📰 Generate e-Paper Clip

అమరావతి,అర్జున్ సమాచారం:

ప్రకాశం జిల్లా ఒంగోలు బైపాస్ రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏఆర్ కానిస్టేబుల్ మరియదాస్ మృతి చెందడం బాధాకరమని హోంమంత్రి వంగలపూడి అనితఅన్నారు

ప్రజల రక్షణ కోసం విధులు నిర్వహించిన పోలీసు సిబ్బందిని కోల్పోవడం పోలీసు శాఖకు తీరని లోటని ఆమె అన్నారు..

మరియదాస్ కుటుంబ సభ్యులకు  ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు..

ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని తెలిపారు ప్రమాదంలో గాయపడిన వారికి అత్యుత్తమ వైద్య చికిత్స అందించాలని అధికారులను ఆదేశించిన ఆమె, ప్రమాదానికి దారితీసిన కారణాలపై సమగ్ర విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

మరియదాస్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని హోంమంత్రి ఆకాంక్షించారు..
=======================

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!