ePaper
Tuesday, August 18, 2026
ePaper
Homeక్రైమ్ న్యూస్శ్రీసిటీలో దొంగల హల్‌చల్‌కు చెక్.. చోరీ యత్నం భగ్నం,

శ్రీసిటీలో దొంగల హల్‌చల్‌కు చెక్.. చోరీ యత్నం భగ్నం,

📰 Generate e-Paper Clip

శ్రీసిటీలో దొంగల హల్‌చల్‌కు చెక్.. చోరీ యత్నం భగ్నం,
 

శ్రీసిటీ, ఆగస్టు 18: అర్జున్ సమాచారం ప్రతినిధి హైద్రాబాద్.
 

శ్రీసిటీలో చోరీకి పాల్పడేందుకు ప్రయత్నించిన దుండగుల యత్నాన్ని భద్రతా సిబ్బంది, పోలీసులు సమర్థవంతంగా అడ్డుకున్నారు. ఆగస్టు 17వ తేదీ తెల్లవారుజామున సుమారు 2 గంటల సమయంలో కోల్డ్మన్ కంపెనీ ప్రాంగణంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

గస్తీలో ఉన్న శ్రీసిటీ భద్రతా సిబ్బందికి కంపెనీ వద్ద అనుమానాస్పద కదలికలు కనిపించడంతో వెంటనే అప్రమత్తమయ్యారు. సమాచారం అందుకున్న శ్రీసిటీ పోలీస్ సబ్‌ఇన్‌స్పెక్టర్ ప్రియాంక పోలీసు సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకుని దుండగులను పట్టుకునేందుకు ప్రయత్నించారు.

 పోలీసుల రాకను గమనించిన నిందితులు స్విఫ్ట్ డిజైర్ కారులో పరారయ్యేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు, శ్రీసిటీ గస్తీ బృందం కారును వెంబడించింది. కడూరు క్రాస్ సమీపంలో కారును వదిలేసి నిందితులు పరారయ్యారు. పోలీసులు కారును స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

 శ్రీసిటీ డీఎస్పీ బి.వి. శ్రీనివాసులు మాట్లాడుతూ.. చోరీ యత్నంపై కేసు దర్యాప్తు కొనసాగుతోందని, నిందితులను గుర్తించి త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!