ePaper
Saturday, August 15, 2026
ePaper
Homeతెలంగాణపెద్దపల్లిరాజాపూర్‌లో జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం చిన్నారులకు ఆల్బెండాజోల్ మాత్రల పంపిణీ

రాజాపూర్‌లో జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం చిన్నారులకు ఆల్బెండాజోల్ మాత్రల పంపిణీ

📰 Generate e-Paper Clip

పెద్దపల్లి ప్రతినిధి, అర్జున్ సమాచార్, జూలై 13: పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం రాజాపూర్ గ్రామ అంగన్‌వాడీ కేంద్రంలో సోమవారం జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమంలో భాగంగా ఒక సంవత్సరం నుంచి 19 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు ఆల్బెండాజోల్ 400 మిల్లీగ్రాముల మాత్రలను పంపిణీ చేశారు.
గ్రామ సర్పంచ్ పుల్లెల భాగ్యలక్ష్మి కొమరయ్య, ఉపసర్పంచ్ కలవేన శ్రీకాంత్ ముదిరాజ్ ఆధ్వర్యంలో, ఆశా కార్యకర్త పొట్ల సంధ్య సమక్షంలో కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ, పేగు పురుగుల నివారణకు ఆల్బెండాజోల్ మాత్రలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. గ్రామంలోని అర్హులైన ప్రతి చిన్నారికి ఈ మాత్రలు అందేలా తల్లిదండ్రులు సహకరించాలని, ప్రభుత్వ ఆరోగ్య కార్యక్రమాలను ప్రతి కుటుంబం సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి దాసరపు కిరణ్, అంగన్‌వాడీ టీచర్ ఉగ్గె మంగ, ఆయా పొట్ల సుధారాణి, పిల్లలు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు
RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!