ePaper
Thursday, August 13, 2026
ePaper
Homeతెలంగాణకరీంనగర్డిగ్రీ ప్రవేశాలకు చివరి అవకాశం – దోస్త్ స్పెషల్ ఫేజ్ షెడ్యూల్ విడుదల

డిగ్రీ ప్రవేశాలకు చివరి అవకాశం – దోస్త్ స్పెషల్ ఫేజ్ షెడ్యూల్ విడుదల

📰 Generate e-Paper Clip

కరీంనగర్,అర్జున్ సమాచారం:
: 2026–27 విద్యా సంవత్సరానికి డిగ్రీ ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న దోస్త్ స్పెషల్ ఫేజ్ షెడ్యూల్ విడుదలైనట్లు ఎస్.ఆర్.ఆర్. ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల (అటానమస్) ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె. రామకృష్ణ తెలిపారు. కళాశాలలో బీఎస్సీ, బీకాం, బీబీఏ, బీఏతో పాటు ఏఈడీపీ బీఎస్సీ హెల్త్ కేర్ తదితర కోర్సుల్లో పరిమిత సంఖ్యలో సీట్లు ఖాళీగా ఉన్నాయని, విద్యార్థులు ఈ చివరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జూలై 20 నుంచి 26 వరకు ఆన్‌లైన్ దరఖాస్తులు, జూలై 20 నుంచి 27 వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చని తెలిపారు. జూలై 30న సీట్ల కేటాయింపు జరగనుండగా, జూలై 30 నుంచి ఆగస్టు 1 వరకు ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్, జూలై 31 నుంచి ఆగస్టు 1లోపు ఒరిజినల్ ధ్రువపత్రాలతో కళాశాలలో రిపోర్ట్ చేయాలని సూచించారు. మూడు విడతల్లో ప్రవేశం పొందని విద్యార్థులు రిజిస్ట్రేషన్ ఫీజు లేకుండానే స్పెషల్ ఫేజ్‌లో పాల్గొనవచ్చని, కొత్తగా నమోదు చేసుకునేవారు రూ.400 ఫీజు చెల్లించాలని తెలిపారు. నిర్ణీత గడువులో రిపోర్ట్ చేయని పక్షంలో కేటాయించిన సీటు రద్దు అవుతుందని హెచ్చరించారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!