ePaper
Thursday, August 13, 2026
ePaper
Homeతెలంగాణహైదరాబాద్తెలంగాణ లో వైద్యం, ఆరోగ్యం పడకేసాయి మాజీ మంత్రి హరీష్ రావు

తెలంగాణ లో వైద్యం, ఆరోగ్యం పడకేసాయి మాజీ మంత్రి హరీష్ రావు

📰 Generate e-Paper Clip

హైదరాబాద్,అర్జున్ సమాచారం:
బాన్సువాడ మాతా-శిశు ఆసుపత్రిలో శస్త్రచికిత్స అనంతరం తీవ్ర అస్వస్థతకు గురై నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలింతలను, వారి కుటుంబ సభ్యులను మాజీ మంత్రి హరీష్ రావు పరామర్శించాను.  బాలింతల ఆరోగ్య పరిస్థితి, అందుతున్న వైద్యంపై నిమ్స్ డాక్టర్లను అడిగి తెలుసకున్నారు.  అలాగే, ఖమ్మంలో జరిగిన దారుణ ఘటనలో తీవ్రంగా గాయపడి నిమ్స్ లోనే చికిత్స పొందుతున్న మైనర్ బాలికను కూడా పరామర్శించి, వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ వారికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
హరీష్ రావు మాట్లాడుతూ …ఈ నెల 13వ తేదీన బాన్సువాడ ఆసుపత్రిలో డెలివరీకి వెళ్లిన 10 మంది మహిళలకు సిజేరియన్ ఆపరేషన్ చేసిన తర్వాత ఇన్ఫెక్షన్స్ సోకి పరిస్థితి విషమించింది. వారిని నిజామాబాద్ ఆసుపత్రికి, అక్కడి నుంచి నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం నిమ్స్ లో ఫాతిమా, రుక్సానా, జ్యోతి, లక్ష్మీప్రియ, సునీత అనే ఐదుగురు బాలింతలు చికిత్స పొందుతున్నారు. ఈ ఐదుగురిలో ముగ్గురి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. తెల్ల రక్త కణాలు తగ్గిపోవడం, ఊపిరితిత్తులు మరియు కిడ్నీలలో ఇన్ఫెక్షన్ కారణంగా వారు ఐసీయూలో డయాలసిస్ పైన ఉన్నారు. ఈ దారుణమైన సంఘటన జరిగి 10 రోజులు కావస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేదు. ఏ ఒక్క మంత్రి, ఎమ్మెల్యే లేదా వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారి వచ్చి బాధితులను పరామర్శించిన పాపాన పోలేదని అన్నారు.
అసలు ఈ సంఘటన ఎందుకు జరిగింది? దీని వెనుక ఉన్న కారణాలు ఏంటి? అని తెలుసుకునే కనీస ప్రయత్నం కూడా ప్రభుత్వం చేయలేదు. ఇప్పటివరకు పూర్తి స్థాయి విచారణకు కూడా ఆదేశించకపోవడం దారుణం.  బాలింతలు పూర్తిగా కోలుకోకపోతే రేపు ఆ పసిపిల్లల్ని ఎలా చూసుకోవాలి. ఆ కుటుంబ పరిస్థితులు ఎంత దారుణంగా దెబ్బతింటాయో ప్రభుత్వం ఒక్కసారి ఆలోచించాలి. 10వ తేదీన ఆరుగురికి సిజేరియన్ చేసినప్పుడు వారికి ఇన్ఫెక్షన్ వచ్చిందని తెలిసిన తర్వాత కూడా.. అదే థియేటర్లో మళ్ళీ మరో నలుగురికి సిజేరియన్ ఎందుకు చేశారు.. ఆపరేషన్ జరిగిన వారికి రాత్రి నుంచే మోషన్స్, వాంతులు, చలిజ్వరంతో ఇబ్బంది పడుతున్నా.. అదే ఆపరేషన్ థియేటర్లో మరో నలుగురికి సిజేరియన్ చేయడం వల్ల వారు కూడా ఇన్ఫెక్షన్ బారిన పడ్డారు. ఆపరేషన్ థియేటర్లో మెయింటెనెన్స్ సరిగా లేకపోవడం వల్లే ఇన్ఫెక్షన్ సోకిందని, డాక్టర్ల నిర్లక్ష్యానికి తాము బలయ్యామని బాధిత కుటుంబాలు చెబుతున్నాయి. కాలం చెల్లిన మందులు వాడటం వల్లే తమకు ఈ పరిస్థితి ఏర్పడిందని ఇంకొక పేషెంట్ బంధువులు ఆరోపిస్తున్నారు. ఇంత తీవ్రమైన ఘటన జరిగితే ప్రభుత్వం ఎందుకు గోప్యంగా ఉంచే ప్రయత్నం చేస్తోంది? దీనిపై ఎందుకు విచారణకు ఆదేశించలేదు.. ఈ ఘటనపై తక్షణమే పూర్తి స్థాయి విచారణ జరపాలి. నిర్లక్ష్యానికి కారణమైన వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఒక పేషెంట్ నిజామాబాద్ లోని ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్తే రెండు రోజుల్లోనే 3 లక్షల రూపాయలు ఖర్చు అయ్యాయి.  వంటి మీదున్న బంగారం అమ్ముకుని, మూడు రూపాయల వడ్డీకి అప్పు తెచ్చి ఖర్చు పెట్టినా తన బిడ్డ ఆరోగ్యం ఇంకా మెరుగుపడలేదని ఆ తల్లి కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ నేరపూరితమైన నిర్లక్ష్యం. రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖ పూర్తిగా పడకేసిందని అన్నారు.
10 మంది మహిళల ప్రాణాలతో చెలగాటమాడినా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదు. మీ ఇందిరమ్మ పాలనలో మహిళల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. ఇందిరమ్మ పాలన అనేది కేవలం మాటల్లోనే ఉంది. మొన్నటికి మొన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆసుపత్రిలో జాయిన్ చేసుకోకపోవడం, బెడ్ ఇవ్వకపోవడం వల్ల నిలబడే బిడ్డకు జన్మనిచ్చిన హృదయ విధారకమైన సంఘటన ఈ రాష్ట్రంలో జరిగింది. తల్లులకు సోకిన ఇన్ఫెక్షన్ పాల రూపంలో పసిపిల్లలకు కూడా చేరి.. ఆ పిల్లలు జాండిస్ తో రకరకాల ఇబ్బందులు పడుతూ నీలోఫర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పరిస్థితి ఏర్పడింది. ఈ ప్రభుత్వం ప్రభుత్వ ఆసుపత్రులను గాలికి వదిలేసింది. కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు బిడ్డ కడుపులో పడగానే న్యూట్రిషన్ కిట్, పుట్టగానే కేసీఆర్ కిట్ ఇచ్చాం. ఆరోగ్య లక్ష్మి పథకం కింద పాలు, పౌష్టికాహారాన్ని అందించాం. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీలు కేవలం 30-35% ఉంటే, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దానిని 72 శాతానికి తీసుకువెళ్ళాం. కానీ ఈరోజు మళ్ళీ అది 50 శాతానికి పడిపోయింది. సి సెక్షన్ రేటు విపరీతంగా పెరిగిపోయింది. ఆసుపత్రులను మానిటర్ చేయడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. రేవంత్ రెడ్డి  ఏమీ బంద్ చేయలేదు అంటారు, కానీ న్యూట్రిషన్ కిట్, కేసీఆర్ కిట్ బంద్ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు సకాలంలో లేకపోవడం వల్ల నమ్మకం సన్నగిల్లి డెలివరీల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మదర్ మోర్టాలిటీ రేటును 92% నుంచి 43 కు తగ్గించి, దేశంలోనే మూడవ ఉత్తమ రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దాం. కానీ మీ హయాంలో ప్రభుత్వ ఆసుపత్రులకు సుస్తీ పట్టింది. ఈ సంఘటన మీద మీరేమైనా ఎంక్వయిరీ ఆర్డర్ చేశారా? చేస్తే ఆ ఎంక్వయిరీ రిపోర్ట్ బయట పెట్టండి. ఆ సిబ్బంది ఎవరు, డాక్టర్స్ ఎవరు అన్నది వెల్లడించి వారిపై యాక్షన్ తీసుకోవాలి. ఆ తల్లులకు కాళ్లు వాపులు వస్తున్నాయి, డయాలసిస్ జరుగుతోంది. భవిష్యత్తులో కూడా లైఫ్ లాంగ్ డయాలసిస్ తీసుకోవాల్సి వస్తే మా పుట్టిన పిల్లల పరిస్థితి ఏంటి అని ఆ తల్లులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. బాధిత కుటుంబాలకు పూర్తి స్థాయి వైద్యం అందించి, వారికి తగిన ఎక్స్ గ్రేషియా ఇచ్చి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని అన్నారు.
===========================

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!