తిరుపతి,అర్జున్ సమాచారం:
నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 36వినతులు వచ్చాయని కమిషనర్ (ఎఫ్.ఏ.సి) శారదా దేవి తెలిపారు. సోమవారం తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో డయల్ యువర్ కమిషనర్, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఫోన్ ద్వారా 16 మంది, కార్యాలయంకు నేరుగా వచ్చి 20 మంది వినతులు సమర్పించి తమ సమస్యలు తెలిపారు.
కాగా సంజీవయ్య కాలనీలో ఇంటి ముందు ప్రమాధకరంగా ఉన్న చెట్ల కొమ్మలు తొలగించాలని, పట్నూల్ వీధిలో సిసి రోడ్డు ఏర్పాటు చేయాలని, ఎస్.ఎల్.వి నగర్ నందు మా ఇంటి పక్కన ఎటువంటి అనుమతులు లేకుండా, సెట్ బ్యాక్ వంటివి లేకుండా నాలుగు అంతస్థుల భవనం నిర్మిస్తుండడం వలన ఇబ్బందిగా ఉందని, కొత్తపల్లి నందు నూతనగా కాలువలు, తాతయ్య గుంట గంగమ్మ గుడి ఎదురుగా తోపుడు బండ్లు పెట్టడం వలన ఇబ్బందిగా ఉందని, కొరమేనుగుంట నందు రోడ్లు వేసి పేద దిబ్బలు వంటివి తొలగింపు చర్యలు చేపట్టాలని, మహిళా యూనివర్సిటీ వద్ద తెలుగుగంగ పైప్ లైన్ లీకేజీ అరికట్టాలని, గాజు వీధి, లక్ష్మీపురం లలో రోడ్డు గుంతలు పూడ్చాలని, వీధి లైట్లు ఏర్పాటు చేయాలని, వీధి కుక్కలను నియంత్రించాలని కోరారు.
ఈ కార్యక్రమం లో డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యాంసుందర్, మునిసిపల్ ఇంజినీర్ తులసి కుమార్, గోమతి, రెవిన్యూ ఆఫీసర్ రవి, డి.ఈ.లు ఏసీపీ మూర్తి, హార్టికల్చర్ ఆఫీసర్ హరికృష్ణ, ఫైర్ ఆఫీసర్ శ్రీనివాసులు, మేనేజర్ హాసీమ్, శానిటరీ సూపర్ సూపర్ వైజర్లు చెంచయ్య, సుమతి తదితరులు పాల్గొన్నారు.
=============================

