కరీంనగర్,అర్జున్ సమాచారం:
కరీంనగర్లోని తీగలగుట్టపల్లి ఆర్వోబీ నిర్మాణ పనుల జాప్యంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఎందుకు చేయలేదని ఆర్అండ్బి అధికారులు, కాంట్రాక్టర్లను ప్రశ్నించారు. భూసేకరణలో జాప్యం కారణంగా పనులు ఆలస్యమయ్యాయని అధికారులు వివరించగా, బీటీ రోడ్డు, కల్వర్టు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయలేదని తెలిపారు. దీంతో మేయర్ కొలగాని శ్రీనివాస్, కమిషనర్ ప్రపుల్ దేశాయ్ వెంటనే ఆర్వోబీ ప్రాంతాన్ని పరిశీలించి, మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలోనే యుద్ధ ప్రాతిపదికన బీటీ రోడ్డు, కల్వర్టు నిర్మాణ పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కాగా, భూసేకరణ పూర్తయిన వెంటనే ఆర్వోబీ పనులను వేగవంతం చేసి నిర్ణీత గడువులో పూర్తి చేస్తామని కాంట్రాక్టర్ వెల్లడించారు.

