జగిత్యాల,అర్జున్ సమాచారం:
కొండగట్టు వద్ద కరీంనగర్–జగిత్యాల ప్రధాన రహదారిపై నిన్న సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాద ఘటన స్థలాన్ని జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ ఐపీఎస్ గారు పరిశీలించారు. ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని పరిశీలించిన ఎస్పీ గారు, ప్రమాదానికి దారితీసిన పరిస్థితులు, రహదారి పరిస్థితి, వాహనాల కదలిక, వాహన వేగం తదితర అంశాలపై సంబంధిత పోలీసు అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలను అన్ని కోణాల్లో విచారించి, సమగ్ర దర్యాప్తు చేపట్టాలని, దర్యాప్తును వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. ప్రమాదానికి సంబంధించిన ప్రతి అంశాన్ని పరిశీలించి, వాస్తవాలను వెలికితీసే విధంగా దర్యాప్తు చేపట్టాలని అధికారులకు సూచించారు. వాహనదారులు అధిక వేగంతో వాహనాలను నడపడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని, ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ముందున్న వాహనాలను ఓవర్ టేక్ చేసే సమయంలో జాగ్రత్తగా నడుపుతూ, ముందున్న వాహనాలకు తగిన దూరం పాటించాలని, ప్రధాన రహదారులపై మరింత అప్రమత్తంగా ప్రయాణించాలని తెలిపారు.
======================

