రంగనాథ్‌ను వీలైనంత త్వరగా బదిలీ చేయాలి:
హైకోర్టు
హైదరాబాద్(అర్జున్ సమాచారం ప్రతినిధి.ఆగస్టు,1,
తెలంగాణ హైడ్రా శాంతాశ్రీరామ్ కన్‌స్ట్రక్షన్ కంపెనీ కేసులో హైకోర్టు తీర్పు వెలువరించింది. వివాదాస్పద ఆస్తిలోకి యంత్రాలు, సిబ్బందితో వెళ్లడం చట్టవిరుద్దమన్న హైకోర్టు.. రంగనాథ్‌ను వీలైనంత త్వరగా బదిలీ చేయాలని సీఎస్‌కు సూచించింది. ఇందుకు టాటా మోహన్‌రావు కేసులో సుప్రీంకోర్టు ఉత్తర్వులను రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఉదహరించింది. చట్ట పాలన మాత్రమే కొనసాగాలని, వ్యక్తుల పాలన కాదని పేర్కొంది. వ్యక్తి ఆధిపత్యం పెరిగిందనేందుకు ఇదొక ఉదాహరణ అని అభిప్రాయపడింది.

