ePaper
Thursday, August 13, 2026
ePaper
Homeతెలంగాణసిద్ధిపేటఆచార్య జయశంకర్ సార్ జయంతి సందర్బంగా నివాళ్లు అర్పించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్...

ఆచార్య జయశంకర్ సార్ జయంతి సందర్బంగా నివాళ్లు అర్పించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు

📰 Generate e-Paper Clip

సిద్దిపేట,అర్జున్ సమాచారం:
ఈ సందర్బంగా హరీష్ రావు మాట్లాడుతు
తెలంగాణ సిద్దాంతకర్త జయశంకర్ జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు.
జయశంకర్  జీవితాంతం తెలంగాణ కోసం పోరాడిన మహనీయులు
ఆయనకు సిద్దిపేటతో అవినావభవ సంబంధం ఉంది
సిద్దిపేటలో అమరవీరుల స్తూపం ఆయన చేతుల మీదుగానే శంకుస్తపాన చేసుకున్నాం.
తెలంగాణ రాష్ట్ర సాధన కేసీఆర్ తోనే సాధ్యమని నమ్మి ఆయనతోనే వెన్నుదన్నుగా ఉన్నారు
జయశంకర్ వ్యక్తి కాదు శక్తి
రాష్ట్రం కోసం ఆయన చేసిన పోరాటం ఎప్పటికీ చరిత్ర పుటలలో నిలిచిపోతుంది.
ఇవాళ రాష్ట్రం సాధించామంటే అది జయశంకర్ సార్, కేసీఆర్ పోరాటం వల్లనే.. పదేళ్ళలో కేసీఆర్ పాలనలో తెలంగాణ ఆత్మ గౌరవాన్ని అద్భుతంగా నిలబెట్టారు
కానీ ఇప్పుడు తెలంగాణ సోయిలేని వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నాడు.
అందుకే ఇప్పుడు నదీ జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం జరుగుతున్నది
తెలంగాణ కోసం ఉద్యమం చేసి, పోరాడి కేసీఆర్ ప్రభుత్వం 383 టీఎంసీల గోదావరి జలాలకు అనుమతులు సాధించింది.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 3 ఏండ్లు అయినా ఒక్క ప్రాజెక్టుకు అనుమతులు సాధించలేదు.
ఇప్పుడు ఆ అనుమతులను రద్దు చేసే పరిస్థితి వచ్చింది
జిఆర్ ఎంబి ఏజెండాలో తెలంగాణ ప్రాజెక్టుల అనుమతులను అడ్డుకోవాలని చేర్చడం ఇదే మొదటి సారి
ఇది కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం.
ఇప్పటికైనా జీఆర్ఎంబీ ఎజెండాలో తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా ఉన్న ప్రతిపాదనలను అడ్డుకోవాలి
ఆంద్రప్రదేశ్ కడుతున్న బనకచర్ల ప్రాజెక్టును ఎందుకు ఆపలేకపోతున్నారు
సమ్మక్కసాగర్ కు కేటాయించిన నీటిని ఎందుకు వదులుకుంటున్నరు.
తెలంగాణ ప్రయోజనాలను కాపాడటానికి ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలి
జయశంకర్ కి నిజమైన నివాళులు అర్పించడం అంటే మన నీటి వాటాను మనం కాపాడుకోవాలి.
==========================

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!