ePaper
Thursday, August 13, 2026
ePaper
Homeతెలంగాణసిద్ధిపేటబ్రిటన్ హౌస్ ఆఫ్ లార్డ్స్ సభ్యుడు ఉదయ్ నాగరాజు సన్మానం పాల్గోన్న హరీష్ రావు సిద్దిపేట

బ్రిటన్ హౌస్ ఆఫ్ లార్డ్స్ సభ్యుడు ఉదయ్ నాగరాజు సన్మానం పాల్గోన్న హరీష్ రావు సిద్దిపేట

📰 Generate e-Paper Clip

సిద్దిపేట,అర్జున్ సమాచారం:
బ్రిటన్ పార్లమెంట్ హౌస్ ఆఫ్ లార్డ్స్ కు ఎన్నికైన సిద్దిపేట ముద్దుబిడ్డ ఉదయ్ నాగరాజు రి పౌర సన్మాన కార్యక్రమం సిద్దిపేటలోని విపంచి కళానిలయంలో అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి హరీష్ రావు ముఖ్య అతిథిగా హాజరై ఉదయ్ నాగరాజు కి శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. ఉదయ్ నాగరాజు  తన పేరుకు తగ్గట్లే సార్థకత తీసుకొచ్చారు, తెలంగాణలో ఉదయించి బ్రిటన్లో వెలుగొందుతున్నారు.మన రెండు తెలుగు రాష్ట్రాల నుండి బ్రిటన్ పార్లమెంటుకు ఎన్నికైన మొట్టమొదటి వ్యక్తి ఉదయ్ నాగరాజని కొనియాడారు.  ఎంతో కృషి పట్టుదల ఉంటే తప్ప అంత ఉన్నతమైన పదవి రాలేదు. ఉదయ్ ది నాది రెండున్నర దశాబ్దాల పరిచయం. ఆయన పెళ్ళికి కూడా హాజరయ్యాను. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా లండన్ నుండి ఉద్యమానికి మద్దతిచ్చారు. మనం ఎట్లా అయితే ఇక్కడ పోరాడామే ఆయన కూడా తన భాగస్వామ్యం అందించారని గుర్తు చేసుకున్నారు.
ఉదయ్ నాగరాజు  బ్రిటన్ లో మరింత ఉన్నతమైన పదవులు పొందాలని, అక్కడి ప్రజలకు మంచి సేవలు అందించాలని కోరుకుంటున్నాను.  ఉదయ్ నాగరాజు  ఎంత దూరం వెళ్ళినా మన ఆచారాలను, సంప్రదాయాలను పాటించడం సంతోషంగా ఉంది.  ఉదయ్ నాగరాజు కి సన్మానం చేయడం అంటే సిద్దిపేట ప్రజలకు, తెలంగాణకే కాకుండా యావత్ భారతీయులకు గర్వకారణం. పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యం అనేది ఉదయ్ ని చూస్తే తెలుస్తోంది, యువత ఆయనను ఆదర్శంగా తీసుకోవాలి.  ఉదయ్  నుండి యువత నేర్చుకోవాలి. చిన్న పల్లెటూరులో పుట్టి బ్రిటన్ పార్లమెంటు కు ఎన్నికయ్యారు.   ఆయన కృషి, పట్టుదల, సేవలు ఆయనకు ఇంత ఉన్నతమైన స్థానం అందించాయి. ప్రతి మనిషిలో కూడా సామర్థ్యం ఉంటుంది. వాటిని వెలికితీసి కష్టపడి విజయం సాధించాలని అన్నారు.
============================

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!