ePaper
Thursday, August 13, 2026
ePaper
Homeతెలంగాణసిద్ధిపేటతక్షణమే రిజర్వాయర్లకు 30టి ఎంసి ల నీటిని ఎత్తిపోయాలి: మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్...

తక్షణమే రిజర్వాయర్లకు 30టి ఎంసి ల నీటిని ఎత్తిపోయాలి: మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు

📰 Generate e-Paper Clip

సిద్దిపేట,అర్జున్ సమాచారం:

రైతు లు నీటిని ఎత్తి పోస్తారని ఎదురు చూస్తున్నారు రిజర్వాయర్ల దుస్థితి చూస్తే మాత్రం దుఃఖం వస్తోందని ఆవేదన వ్యక్తం చేసిన హరీష్ రావు.
జిల్లా లో వచ్చే ఏడాది జులై నాటికీ సాగు, త్రాగు నీటి కొరత లేకుండా చూడాలి
రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా ఇరిగేషన్, వ్యవసాయ అధికారులు సమన్వయం తో పని చేయాలి
జిల్లా కలెక్టర్ కి, ఇరిగేషన్ అడ్వైజరి కమిటీ కి లేఖ వ్రాసిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు.
జిల్లాలోని రిజర్వాయర్లలో తక్షణమే 30 టీఎంసీల నీటిని ఎత్తిపోయడం మరియు వచ్చే వానాకాలం వరకు జిల్లా రైతులకు, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా మళ్లీ వేసవిలో నీటిని ఎత్తిపోయడానికి మిడ్ మానేరులో సరిపడా నీళ్లను నిల్వ చేసేలా చర్యలు చేపట్టాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు జిల్లా కలెక్టర్ కి, ఇరిగిషన్ అడ్వైజరి కమిటీకి లేఖ వ్రాసారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం లో జిల్లా ఇరిగేషన్ అడ్వైజరీ కమిటీ చైర్మన్, జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగే సమావేశం సందర్బంగా జిల్లా కలెక్టర్ కి హరీష్ రావు  లేఖ వ్రాసి పలు అంశాలు కమిటీ ద్రుష్టి కి తెచ్చారు.
ఎల్నినో ప్రభావంతో జిల్లా స్థాయిలో ఇరిగేషన్ కమిటీ సమావేశాన్ని నిర్వహిసున్న నేపథ్యంలో మీ దృష్టికి కొన్ని అంశాలు తెస్తున్నానని లేఖలో పేర్కొన్నారు. ఈ అంశాలపై తక్షణమే చర్యలు చేపడితే వచ్చే వానాకాలం వరకు ఎల్నినో ప్రభావాన్ని అధిగమించగలరని లేఖ ద్వారా కోరారు.
కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులో భాగంగా సిద్దిపేట జిల్లాలో అన్నపూర్ణ, రం గనాయకసాగర్, కొమురవెల్లి మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్లను నిర్మిం చుకున్నాము. ప్రతీఏటా ఈ సమయం వరకే రిజర్వాయర్లలోకి రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మిడ్ మానేరు రిజర్వాయర్ నుండి నీటిని ఎత్తిపోయడం జరిగేది. కానీ ఈసారి ఇంకా ఎత్తి పోతలు ప్రారంభించలేదన్నారు.
అన్నపూర్ణ, రంగనాయకసాగర్ రిజర్వాయర్లు ప్రస్తుతం డెడ్జోరేజీలో ఉన్నాయి. వీటిని వెంటనే నింపాల్సి ఉంది. అదే విధంగా కొమురవెళ్లి మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్లు అడుగంటే పరిస్థితిలో ఉన్నాయన్నారు.
ఈ రిజర్వాయర్లలోకి తక్షణమే 30 టీఎంసీల నీటిని ఎత్తిపోసి చెరువులు,కుంటలు మరియు చెక్ డ్యాంలు నింపి పెట్టాలని కోరుచున్నాను. దీని వల్ల భూగర్భజలాలు పెరిగి ఈ వానాకాలం పంటల సీజన్లో జిల్లాలోని రైతులకు ప్రయోజనంగా ఉంటుందని చెప్పారు.
================================

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!