ePaper
Monday, October 26, 2026
ePaper
Homeతెలంగాణఐదు నెలలైనా వెలగని సెంట్రల్‌ లైటింగ్‌!కొత్త రహదారిపై చీకట్లు.. ఇటీవల కారు ప్రమాదంలో పలువురికి తీవ్ర...

ఐదు నెలలైనా వెలగని సెంట్రల్‌ లైటింగ్‌!కొత్త రహదారిపై చీకట్లు.. ఇటీవల కారు ప్రమాదంలో పలువురికి తీవ్ర గాయాలు.ప్రజల భద్రతపై ఆందోళన.. ఆర్‌ అండ్‌ బీ అధికారుల నిర్లక్ష్యం పై గ్రామస్తుల అసహనం

📰 Generate e-Paper Clip

ఐదు నెలలైనా వెలగని సెంట్రల్‌ లైటింగ్‌!కొత్త రహదారిపై చీకట్లు.. ఇటీవల కారు ప్రమాదంలో పలువురికి తీవ్ర గాయాలు.ప్రజల భద్రతపై ఆందోళన.. ఆర్‌ అండ్‌ బీ అధికారుల నిర్లక్ష్యం పై గ్రామస్తుల అసహనం.

అర్జున్ సమాచారం , అక్టోబర్ 25 . రామగిరి రిపోర్టర్.

రామగిరి మండలంలోని సింగరేణి ప్రభావిత ముంపు గ్రామమైన రాజాపూర్‌లో కొత్త రహదారి నిర్మాణం పూర్తయి, ఐదు నెలలు గడుస్తున్నా సెంట్రల్‌ లైటింగ్‌ వ్యవస్థ అందుబాటులోకి రాకపోవడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాత్రి వేళల్లో రహదారి చీకటిమయంగా మారుతుండటంతో వాహనదారులు, పాదచారులు ప్రమాదాల ముప్పును ఎదుర్కొంటున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రహదారి నిర్మాణం పూర్తయినప్పటికీ లైటింగ్‌ వ్యవస్థను ఎందుకు ప్రారంభించడం లేదని ప్రశ్నిస్తున్నారు.
రాజాపూర్‌ గ్రామం సింగరేణి ప్రభావిత ప్రాంతంలో ఉండటంతో ఇక్కడి రహదారులు, మౌలిక సదుపాయాలు ,ప్రజల రాకపోకలకు ఎంతో కీలకంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కొత్త రహదారిపై సెంట్రల్‌ లైటింగ్‌ ఏర్పాటు చేయడం వల్ల రాత్రివేళల్లో ప్రయాణం సురక్షితంగా ఉంటుందని గ్రామస్తులు భావిస్తున్నారు. అయితే రహదారి నిర్మాణం పూర్తయి నెలలు గడుస్తున్నా, లైట్లు వెలగకపోవడంతో ప్రజలకు ఎదురుచూపులు తప్పడం లేదని వాపోతున్నారు.
ఇటీవల కారు ప్రమాదంలో. పలువురికి తీవ్ర గాయాలుజరిగినవి.
ఇదే రహదారిపై ఇటీవల కారు ప్రమాదం చోటుచేసుకుని పలువురు గాయపడిన ఘటన స్థానికుల్లో మరింత ఆందోళన కలిగించింది. రాత్రివేళల్లో సరైన వెలుతురు లేకపోవడం వల్ల రహదారిపై ప్రయాణం ప్రమాదకరంగా మారుతోందని గ్రామస్తులు పేర్కొంటున్నారు. ప్రమాదం జరిగిన నేపథ్యంలోనైనా సంబంధిత అధికారులు స్పందించి లైటింగ్‌ వ్యవస్థను వెంటనే ప్రారంభించాలని కోరుతున్నారు.
రహదారుల నిర్మాణంతో పాటు ప్రయాణికుల భద్రతకు అవసరమైన సదుపాయాలను కూడా అందుబాటులోకి తీసుకురావడం ముఖ్యమని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. కొత్త రహదారి అందుబాటులోకి వచ్చినప్పటికీ రాత్రివేళల్లో చీకటితో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతుండటం వల్ల వాహనదారులు అప్రమత్తంగా ప్రయాణించాల్సి వస్తోందని చెబుతున్నారు. ముఖ్యంగా రాత్రి సమయాల్లో రహదారిపై వెలుతురు లేకపోవడం ప్రమాదాల భయాన్ని పెంచుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సింగరేణి అధికారులకు ఆర్‌ అండ్‌ బీ అధికారులు వత్తాసు పలుకుతున్నారా?
సెంట్రల్‌ లైటింగ్‌ సమస్యపై గతంలో పలుమార్లు దృష్టి సారించినప్పటికీ సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సమస్య పరిష్కారంలో జాప్యం ఎందుకు జరుగుతోందో అధికారులు స్పష్టం చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఈ వ్యవహారంలో సింగరేణి అధికారులకు ఆర్‌ అండ్‌ బీ అధికారులు వత్తాసు పలుకుతున్నారనే అనుమానాలు గ్రామస్తుల్లో వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ ఆరోపణలపై సంబంధిత అధికారుల వివరణ తెలియాల్సి ఉంది. ఎన్నిసార్లు చెప్పినా కూడా వారు స్పందించకపోవడం, జరుగుతున్నది.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!