ePaper
Wednesday, August 26, 2026
ePaper
Homeక్రైమ్ న్యూస్50వేల తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన వాణిజ్య శాఖ అధికారులు.

50వేల తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన వాణిజ్య శాఖ అధికారులు.

📰 Generate e-Paper Clip

50వేల తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన వాణిజ్య శాఖ అధికారులు.

జగిత్యాల ప్రతినిధి అర్జున్ సమాచారం ఆగస్టు 25::

నిర్మల్ జిల్లాలో వాణిజ్య శాఖ పన్నుల కార్యాలయంలో 50 వేల లంచం తీసుకుంటూ సోమవారం ఇద్దరు అధికారులు ఏసీబీకి చిక్కారు. నిర్మల్ పట్టణంలోని వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయంలో ఎస్ టి ఓ గా పనిచేస్తున్న గోదావరి, సీనియర్ అసిస్టెంట్ సాయి కృష్ణ సోమవారం శాఖ కార్యాలయంలో బాధితుల నుంచి 50 వేల లంచం తీసుకోగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

మంచిర్యాల పట్టణానికి చెందిన ఓ వ్యాపారి శ్రీ లక్ష్మీ ప్రసన్న జ్యువెలర్స్‌ కు సంబంధించిన 2022-23, 2023-24 ఆర్థిక సంవత్సరాల రికార్డుల ఆడిట్‌ లో అనుకూలమైన నివేదిక ఇచ్చేందుకు అధికారులు తొలుత లక్ష లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. చివరకు రూ.50 వేలకు ఒప్పందం కుదిరింది. లంచం ఇవ్వడం ఇష్టం లేని బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఈ క్రమంలో ఎస్టీఓ గోదావరి, సీనియర్ అసిస్టెంట్ మంత్రి సాయికృష్ణ వ్యాపారి నుండి రూ.50 వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!