ePaper
Tuesday, October 13, 2026
ePaper
Homeతెలంగాణముత్తారం మండల రైతులకు సాగునీరు అందించాలి,ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి రిజర్వాయర్లను నింపాలి,మాజీ ఎంపీపీ, లక్కారం సర్పంచ్...

ముత్తారం మండల రైతులకు సాగునీరు అందించాలి,ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి రిజర్వాయర్లను నింపాలి,మాజీ ఎంపీపీ, లక్కారం సర్పంచ్ అత్తే చంద్రమౌళి డిమాండ్

📰 Generate e-Paper Clip

ముత్తారం మండల రైతులకు సాగునీరు అందించాలి,ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి రిజర్వాయర్లను నింపాలి,మాజీ ఎంపీపీ, లక్కారం సర్పంచ్ అత్తే చంద్రమౌళి డిమాండ్.

అర్జున్ సమాచారం: అక్టోబర్ 11 :ముత్తారం రిపోర్టర్.

ముత్తారం మండలంలోని రైతుల పంట పొలాలకు వెంటనే సాగునీరు అందించాలని మాజీ ఎంపీపీ, లక్కారం గ్రామ సర్పంచ్ అత్తే చంద్రమౌళి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యుత్ కోతల కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, సాగునీరు అందక పంట పొలాలు ఎండిపోయే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేసి కమాన్‌పూర్ మండలంలోని గుండారం రిజర్వాయర్‌ను నింపాలని కోరారు. అక్కడి నుంచి లిఫ్ట్ ద్వారా శుక్రవారంపేట రిజర్వాయర్‌కు నీటిని తరలించి, రిజర్వాయర్‌ను నింపిన అనంతరం కాలువల ద్వారా ముత్తారం మండల రైతులకు సాగునీరు అందించాలని విజ్ఞప్తి చేశారు.

ప్రస్తుతం విద్యుత్ కోతలతోపాటు సాగునీటి కొరత కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. రైతులు ఆరుగాలం కష్టపడి సాగు చేసిన పంటలు ఎండిపోకుండా ప్రభుత్వం తక్షణమే స్పందించి సాగునీటి సరఫరాకు చర్యలు చేపట్టాలని కోరారు.

రైతుల సమస్యలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదు. వెంటనే సాగునీరు అందించకపోతే రైతుల పక్షాన ఆందోళన కార్యక్రమాలు చేపడతామని అత్తే చంద్రమౌళి హెచ్చరించారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!