ePaper
Saturday, September 12, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్ఇందుకూరులో ఘనంగా శ్రీకృష్ణుడి అన్నసంతర్పణ

ఇందుకూరులో ఘనంగా శ్రీకృష్ణుడి అన్నసంతర్పణ

📰 Generate e-Paper Clip

ఇందుకూరులో ఘనంగా శ్రీకృష్ణుడి అన్నసంతర్పణ

దేవీపట్నం. అర్జున్ సమాచారం డెస్క్ సెప్టెంబర్ 12.

దేవీపట్నం మండలం ఇందుకూరు గ్రామంలో శ్రీకృష్ణుడి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నసంతర్పణ కార్యక్రమం ఘనంగా జరిగింది.

శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో భాగంగా ఆలయ కమిటీ ఈ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి చుట్టుపక్కల గ్రామాల నుండి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

సుమారు 2000 మంది భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, యువకులు కలిసి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశారు.

భక్తులకు పులిహోర, అన్నం, కూరలతో కూడిన ప్రసాదాన్ని అందజేశారు. ఈ కార్యక్రమం ప్రశాంత వాతావరణంలో భక్తిశ్రద్ధలతో జరిగింది.

ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ, ప్రతి ఏటా ఇలాంటి అన్నసంతర్పణ కార్యక్రమాలు నిర్వహిస్తామని, భక్తుల సహకారంతో ఆలయ అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!