ePaper
Friday, November 6, 2026
ePaper
Homeతెలంగాణరాజాపూర్ ప్రజలకు అండగా ఉంటా.. .నష్టం జరిగితే సహించేది లేదు,సింగరేణి, రెవెన్యూ అధికారుల వల్ల ప్రజలకు...

రాజాపూర్ ప్రజలకు అండగా ఉంటా.. .నష్టం జరిగితే సహించేది లేదు,సింగరేణి, రెవెన్యూ అధికారుల వల్ల ప్రజలకు అన్యాయం జరిగితే బాధితుల పక్షాన పోరాడుతా.. మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ భరోసా,

📰 Generate e-Paper Clip

రాజాపూర్ ప్రజలకు అండగా ఉంటా.. .నష్టం జరిగితే సహించేది లేదు,
సింగరేణి, రెవెన్యూ అధికారుల వల్ల ప్రజలకు అన్యాయం జరిగితే బాధితుల పక్షాన పోరాడుతా.. మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ భరోసా,

అర్జున్ సమాచారం , నవంబర్ 3 .రామగిరి రిపోర్టర్.

పెద్దపల్లి జిల్లా,రామగిరి, సింగరేణి ప్రభావిత గ్రామమైన రామగిరి మండలం రాజాపూర్‌లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌కు గ్రామస్థులు తమ గోడును వెళ్లబోసుకున్నారు. గ్రామంలో నెలకొన్న సమస్యలను స్వయంగా పరిశీలించి, బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని ఆయనను కోరారు. దీనిపై స్పందించిన పుట్ట మధూకర్ రాజాపూర్ ప్రజలకు అండగా ఉంటానని, ఎవరి వల్లనైనా నష్టం జరిగితే సహించేది లేదని భరోసా ఇచ్చారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సింగరేణి సంస్థ, రెవెన్యూ అధికారులు, జిల్లా కలెక్టర్ లేదా మంత్రి స్థాయిలో ఎవరి వల్ల రాజాపూర్ ప్రజలకు అన్యాయం జరిగినా చూస్తూ ఊరుకోబోమని స్పష్టం చేశారు. బాధితులకు అండగా నిలిచి వారి సమస్యల పరిష్కారం కోసం పోరాడుతానని తెలిపారు. గతంలో తమ ప్రభుత్వ హయాంలో సింగరేణి సీఎండీతో నేరుగా మాట్లాడి పలు సింగరేణి ప్రభావిత గ్రామాల సమస్యలను పరిష్కరించినట్లు గుర్తుచేశారు. అదే విధంగా రాజాపూర్ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కూడా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
మూడేళ్లుగా పరిష్కారానికి నోచుకోని సమస్యలు

రాజాపూర్ గ్రామానికి సంబంధించిన సమస్యలు గత మూడు సంవత్సరాలుగా పరిష్కారానికి నోచుకోవడం లేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలను పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ సరైన స్పందన లేకుండా కాలయాపన చేస్తున్నారని వాపోయారు. గ్రామంలోని ఇళ్లను ఆర్‌టీఎచ్, ఆర్‌పీఎన్ పేరుతో రెండు వర్గాలుగా విభజించి పరిహారం చెల్లింపు విషయంలో అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. ఈ విభజన కారణంగా కొంతమంది బాధితులు నష్టపోయే పరిస్థితి ఏర్పడిందని తమ ఆందోళనను మాజీ ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు.

బ్లాస్టింగ్‌లతో ఇళ్లకు నష్టం.. ప్రజల్లో భయాందోళనలు
మరోవైపు సింగరేణి బొగ్గు గనుల్లో చేపడుతున్న బ్లాస్టింగ్‌ల కారణంగా గ్రామంలో దుమ్ము, ధూళి విపరీతంగా వ్యాపిస్తోందని ప్రజలు తెలిపారు. భారీ శబ్దాలు, ప్రకంపనలతో ఇళ్లు దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నిరంతరం బ్లాస్టింగ్‌లు జరుగుతుండటంతో ఇళ్లలో నివసించేందుకు ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారని వివరించారు. ఈ సమస్యలపై సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి నష్టాన్ని అంచనా వేసి బాధితులకు న్యాయం చేయాలని కోరారు.

గ్రామస్థుల విజ్ఞప్తి మేరకు రాజాపూర్ గ్రామాన్ని సందర్శించి అక్కడి పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించాలని పుట్ట మధూకర్‌ను కోరారు. కేవలం హామీలకే పరిమితం కాకుండా తమ సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై ఆయన ప్రజలకు అండగా ఉంటానని భరోసా ఇవ్వడంతో గ్రామస్థులు తమ సమస్యల పరిష్కారంపై ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పాశం ఓదెలు, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పుల్లెల కిరణ్, గ్రామ శాఖ అధ్యక్షుడు కాదాసి రమేష్, కలవేన రమేష్, కలవేన సదానందం, మల్లేష్, పొట్ల సతీష్, మాజీ ఉపసర్పంచ్ కలవేన సంపత్, నూనెటి లింగయ్య, వేల్పుల ఆంజనేయులు, లక్కారం రాజయ్య, పుల్లెల ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!