బంగాళాఖాతంలో అల్పపీడనంఉత్తరాంధ్రలో వర్ష సూచన
విజయవాడ.అర్జున్ సమాచారం ప్రతినిధి. సెప్టెంబర్ 11.
బంగాళాఖాతంలో నిన్న ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతానికి వాయువ్య, పశ్చిమమధ్య బంగాళాఖాతం దానికి ఆనుకుని ఉన్న దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీర ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మత్స్యకారులు వేటకు వెళ్ళారాదని హెచ్చరించింది.

