జగిత్యాల జిల్లా మల్యాల మండలంలో హృదయ విదారక ఘటన
జగిత్యాల జిల్లా ప్రతినిధి .అర్జున్ సమాచారం సెప్టెంబర్ 10::
చోటుచేసుకుంది. గుడిపేట వెళ్లే దారిలోని చెరుకు బావిలో ఓ మహిళ తన చిన్న కొడుకుతో కలిసి ఆత్మహత్యకు పాల్పడింది. చనిపోయే ముందు తన పెద్ద కొడుకును బాగా చూసుకోవాలని సోదరుడికి ఫోన్ చేసి చెప్పడం కలచివేస్తోంది.
మల్యాల మండలం గుడిపేట రోడ్డులోని చెరుకు బావిలో ఈ తెల్లవారుజామున 3:58 గంటలకు ఈ ఘటన జరిగింది.
మృతురాలిని గుండేటి కవిత, 35 సంవత్సరాలుగా, ఆమె చిన్న కుమారుడు నిశాంక్, 6 సంవత్సరాలుగా గుర్తించారు.
ఆత్మహత్యకు ముందు కవిత తన సోదరుడు కొమురయ్యకు ఫోన్ చేసింది. “నా పెద్ద కొడుకును బాగా చూసుకో” అని చెప్పి ఫోన్ పెట్టేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆర్థిక ఇబ్బందులతోనే ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు చెబుతున్నారు.
కవిత భర్త గుండేటి దశరథం ప్రస్తుతం బొంబాయిలో ఉన్నట్లు సమాచారం. భర్తకు విషయం చెప్పేందుకు ప్రయత్నించగా ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

