ePaper
Saturday, November 21, 2026
ePaper
Homeతెలంగాణరాజ్యాంగ దినోత్సవ మహాసభను విజయవంతం చేయండి.....మంథని నియోజకవర్గంలో పోస్టర్, కరపత్రాల ఆవిష్కరణ...

రాజ్యాంగ దినోత్సవ మహాసభను విజయవంతం చేయండి…..మంథని నియోజకవర్గంలో పోస్టర్, కరపత్రాల ఆవిష్కరణ…

📰 Generate e-Paper Clip

రాజ్యాంగ దినోత్సవ మహాసభను విజయవంతం చేయండి…..మంథని నియోజకవర్గంలో పోస్టర్, కరపత్రాల ఆవిష్కరణ…

మంథని:అర్జున్ సమాచారం ప్రతినిధి, రామగిరి.నవంబర్ 21 .

రాజ్యాంగ దినోత్సవ మహాసభను విజయవంతం చేయాలని బహుజన సేన రాష్ట్ర ఉపాధ్యక్షుడు, పెద్దపల్లి జిల్లా ఇన్‌చార్జి తగరం శంకర్‌లాల్, కాటారం మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పూదరి సత్యనారాయణ గౌడ్ పిలుపునిచ్చారు.

ఈ నెల 26న హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌లో బహుజన సేన వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ కదిరే కృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించనున్న రాజ్యాంగ దినోత్సవ మహాసభకు సంబంధించిన పోస్టర్, కరపత్రాలను శుక్రవారం మంథని నియోజకవర్గంలోని రామగిరి మండలంలో నాయకులు ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌పై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని, భారత రాజ్యాంగ ఔన్నత్యం, గొప్పతనాన్ని ప్రజలకు వివరించాలని అన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులు, సామాజిక న్యాయం, సమానత్వ విలువలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు.

ఈ మహాసభకు దళిత, బహుజన సంఘాల నాయకులు, అంబేద్కర్ వాదులు, కవులు, కళాకారులు, ప్రజలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని తగరం శంకర్‌లాల్ కోరారు.

ఈ కార్యక్రమంలో నాయకులు గాజుల ప్రసాద్, బొంకూరి పోశం, తుమ్మల అశోక్, ఆసం తిరుపతి, గద్దల శంకర్, బూస కనకయ్య, ప్రశాంత్, కాట అనిల్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!