దీక్షా దివస్ బహిరంగ సభకు పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలిరావాలి.
మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ పిలుపు.. సభ గోడపత్రికల ఆవిష్కరణ…
అర్జున్ సమాచారం, నవంబర్ 25 ,మంథని రిపోర్టర్.
మంథని: ఈ నెల 29న కరీంనగర్ జిల్లా అలుగునూరులో నిర్వహించనున్న దీక్షా దివస్ బహిరంగ సభకు మంథని నియోజకవర్గంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తెలంగాణ ఉద్యమకారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సభను విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ పిలుపునిచ్చారు.
బుధవారం మంథని పట్టణంలోని రాజగృహాలో దీక్షా దివస్ బహిరంగ సభకు సంబంధించిన గోడపత్రికలను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పుట్ట మధూకర్ మాట్లాడుతూ బీఆర్‌ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ నాయకత్వంలో ఈ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమ చరిత్రను, దీక్షా దివస్ ప్రాధాన్యతను నేటి యువతకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ సభను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో దీక్షా దివస్‌కు ఉన్న ప్రాముఖ్యతను ప్రజలకు వివరించడంతో పాటు ఉద్యమ స్ఫూర్తిని భావితరాలకు తెలియజేయడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు.
ఈ నేపథ్యంలో మంథని నియోజకవర్గంలోని బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తెలంగాణ ఉద్యమకారులు సమన్వయంతో సభకు తరలిరావాలని పుట్ట మధూకర్ కోరారు. పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

