ePaper
Saturday, September 19, 2026
ePaper
Homeతెలంగాణతెలంగాణ మున్నూరు ,కాపు సంఘం పటేల్స్.

తెలంగాణ మున్నూరు ,కాపు సంఘం పటేల్స్.

📰 Generate e-Paper Clip

తెలంగాణ మున్నూరు ,కాపు సంఘం పటేల్స్.

మంచిర్యాల సెప్టెంబర్: అర్జున్ సమాచారం ప్రతినిధి 18.

మంచిర్యాల జిల్లా కేంద్రము నస్పూర్ ప్రెస్ క్లబ్ హాలులో మున్నూరు కాపు పటేల్స్ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బోరిగాం రాజారాం పటేల్ గారి ఆధ్వర్యములో కుటుంబ సభ్యత్వం నమోదుకు వెబ్సైట్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది.
మున్నూరు కాపు కార్పోరేషన్ కు వెయ్యి కోట్లు కేటాయించాలి…
మంచిర్యాల జిల్లా కేంద్రములో రెండు ఎకరాల భూమి బాల బాలికల విద్యార్థి వసతి గృహం హాస్టల్ భవన నిర్మాణం కొరకు 2 కోట్ల రూపాయలు నిధులు
ఇవ్వాలని మున్నూరు కాపు పటేల్ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు కొండ దేవయ్య పటేల్ మాట్లాడినరు.తెలంగాణ మున్నూరు కాపు సంఘం ( పటేల్స్) సభ్యత్వాన్ని తీసుకోవాలని, తద్వారా జనాభా ఎంత ఉందో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందని తెలంగాణ మున్నూరు కాపు సంఘం (పటేల్స్) వ్యవస్థాపక అధ్యక్షులు కొండా దేవయ్య పటేల్ పేర్కొన్నారు. మంచిర్యాల జిల్లా నస్పూర్ ప్రెస్ క్లబ్ లో శుక్రవారం రోజున జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో తమ కుల జనాభా మొదటి స్థానం నుండి 5వ స్థానానికి పడిపోయిందని , తమ జనాభాను చూపించడం లేదని అన్నారు. దీనివలన రాజకీయంగా వెనుకబడిపోయామని ఉద్యోగ ఉపాధి అవకాశాలు తగ్గాయని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం వస్తే తమకు న్యాయం జరుగుతుందని భావింఛామని, కానీ గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని అన్నారు. నేటి ప్రభుత్వం కూడా అదే బాటలో నడుస్తుందని విమర్శించారు. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సంఘం వెబ్సైట్ ద్వారా సభ్యత్వం తీసుకోవాలని కోరారు.. మున్నూరు కాపులలో 8 కులాలను చేర్చాలని కొంతమంది ప్రయత్నిస్తే దానిని అడ్డుకున్నామన్నారు. ఒక్కరు ప్రతి ఒక్కరూ సభ్యత్వం తీసుకోకపోతే తమ కుల జనాభా మొదటి స్థానం నుండి అయిదు వ స్థానానికి పడిపోయే ప్రమాదం ఉందని అన్నారు. ఈ వెబ్సైట్ ద్వారా తాము తిరస్కరించిన ఎనిమిది కులాల వారు సభ్యత్వం తీసుకుంటే గ్రామ, మండల కమిటీల ద్వారా విచారణ జరిపించి అవసరమైతే తీసివేస్తామన్నారు ప్రభుత్వం మున్నూరు కాపు కార్పొరేషన్ ను ఏర్పాటు చేసి ప్రకటించిందే తప్ప నిధులు ఇవ్వలేదన్నారు. ఇప్పటికైనా కార్పొరేషన్ కు 1000 కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. అనంతరం వెబ్సైట్ను ఆవిష్కరించారు. ఈ సమావేశంలో మున్నూరు కాపు సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బోరిగాం రాజారాం పటేల్ గారి ఆధ్వర్యంలో మంచిర్యాల మున్నూరు కాపు పటేల్ సంఘం పట్టణ అధ్యక్షులు పానుగంటి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పాల్లొన్న రాష్ట జిల్లా సంఘం నాయకులు ఆకుల సత్తయ్య పటేల్ నల్ల శంకర్ పటేల్ గొంగళ్ళ శంకర్ పటేల్ పల్లె భూమేష్ పటేల్ చల్లా నరేష్ పటేల్ శ్రీపతి శ్రీనువాసు పటేల్ శ్రీపతి సురేష్ కుమార్ పటేల్. నరెడ్ల శ్రీనివాస్ పటేల్ ఆర్ శ్రీనువాసు పటేల్ గుర్రము సతీష్ పటేల్.యూత్ కాశ రాజు పటేల్ స్టేట్ యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ జిల్లా యూత్ కమిటీ సభ్యులు ఆకుల మహేందర్ ఎడ్ల అజయ్ పానుగంటి సంపత్ అగ్గు మనోహర్ కర్రె ప్రవీణ్ కుమార్ ముదం నందు అక్షయ్ కే దేవరాజు పటేల్ ఎస్ ఈ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!