ePaper
Saturday, September 19, 2026
ePaper
Homeతెలంగాణభీమారం తహశీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన అదనపు(రెవెన్యూ) కలెక్టర్ వి. రాములుఎస్‌ఐఆర్‌ ప్రక్రియను వేగవంతం...

భీమారం తహశీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన అదనపు(రెవెన్యూ) కలెక్టర్ వి. రాములుఎస్‌ఐఆర్‌ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశం

📰 Generate e-Paper Clip

భీమారం తహశీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన అదనపు(రెవెన్యూ) కలెక్టర్ వి. రాములుఎస్‌ఐఆర్‌ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశం.

భీమారం(మంచిర్యాల), అర్జున్ సమాచారం, సెప్టెంబర్ 18 :

మంచిర్యాల జిల్లా భీమారం తహశీల్దార్ కార్యాలయాన్ని శుక్రవారం జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి. రాములు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కార్యాలయంలో జరుగుతున్న ఎస్‌ఐఆర్‌ (సమ్మరీ ఇంటెన్సివ్ రివిజన్) ఓటర్ సవరణ ప్రక్రియ పురోగతిని ఆయన పరిశీలించారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహిస్తూ, ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని తహశీల్దార్‌ను ఆదేశించారు.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ… ఎస్‌ఐఆర్‌ ఓటర్ సవరణలో భాగంగా నోటీసులు అందుకున్న ఓటర్లు, తమ ఓటును కాపాడుకునేందుకు వెంటనే గుర్తింపు/నిర్ధారణ పత్రాల జిరాక్స్ ప్రతులను సంబంధిత బిఎల్‌ఓ లకు ఈ నెల 30 లోపు అందజేయాలని సూచించారు.

ఎస్‌ఐ‌ఆర్ ప్రక్రియపై ప్రజల్లో సమగ్ర అవగాహన కల్పించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. బిఎల్‌ఓలతో పాటు బిఎల్‌ఏ లు, పంచాయతీ కార్యదర్శులు, గ్రామ సర్పంచ్‌లు, ప్రజాప్రతినిధులు, విలేకరులు ముందుకు వచ్చి ఓటర్లకు అవగాహన కల్పించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో భీమారం తహశీల్దార్ సదానందం, డిప్యూటీ తహశీల్దార్ అంజమ్మ, జిపిఓ లు మరియు ఇతర రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!