ePaper
Monday, September 7, 2026
ePaper
Homeతెలంగాణశ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయానికి రూ.20 వేల విరాళం

శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయానికి రూ.20 వేల విరాళం

📰 Generate e-Paper Clip

శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయానికి రూ.20 వేల విరాళం

అర్జున్ సమాచారం | సెప్టెంబర్ 6 | ముత్తారం రిపోర్టర్

ముత్తారం మండలంలోని అడవిశ్రీరాంపూర్ గ్రామంలో ఉన్న శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ అభివృద్ధికి గ్రామ మాజీ సర్పంచ్ బర్ల రాధా చంద్ర‌మౌళి దంపతులు రూ.20 వేల విరాళం అందజేశారు.

ఆదివారం మాజీ సర్పంచ్ బర్ల రాధా చంద్ర‌మౌళి దంపతులు కుటుంబ సమేతంగా ఆలయాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తుల సౌకర్యార్థం ఆలయ ప్రాంగణంలో బోరు ఏర్పాటు చేసేందుకు రూ.20,000 విరాళాన్ని ఆలయ కమిటీకి అందజేశారు.

ఆలయ అభివృద్ధికి ఆర్థిక సహాయం అందించిన బర్ల రాధా చంద్ర‌మౌళి కుటుంబ సభ్యులకు ఆలయ కమిటీ సభ్యులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!