ePaper
Monday, September 7, 2026
ePaper
Homeతెలంగాణఫీ రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని టీఆర్ఎస్ కవిత ర్యాలీ

ఫీ రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని టీఆర్ఎస్ కవిత ర్యాలీ

📰 Generate e-Paper Clip

ఫీ రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని టీఆర్ఎస్ కవిత ర్యాలీ

హన్మకొండ :అర్జున్ సమాచారం ప్రతినిధి సెప్టెంబర్ 7.

ఫీ రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ హన్మకొండ అంబేద్కర్ విగ్రహం వద్ద నుంచి హన్మకొండ కలెక్టరేట్ వరకు తెలంగాణ రక్షణ సేన అధ్యక్షులు కల్వకుంట్ల కవిత విద్యార్థులతో కలిసి ర్యాలీ చేసారు. అంతకు ముందు అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు
కవిత మాట్లాడుతూ విద్యార్థుల ఫీజు బకాయిలు చెల్లించకుండా ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తోంది. ఈ ముఖ్యమంత్రి ఒకసారి ఇంటర్మీడియట్ విద్యా విధానం తీసేస్తానని అంటారు.. ఇంకోసారి పాలిటెక్నిక్ ను స్కిల్ యూనివర్సిటీలో విలీనం అంటారు. విద్యార్థుల ఫీ రీయింబర్స్మెంట్ చెల్లించక పోవడంతో లక్షలాది మంది డిగ్రీలు, ప్రొఫెషనల్ డిగ్రీలు పూర్తి చేసినా సర్టిఫికెట్లు అందక ఉద్యోగాలు పొందలేక పోతున్నారు. ఫీ రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించే వరకు ఈ ప్రభుత్వంపై పోరాడుతామని అన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!