ePaper
Wednesday, October 14, 2026
ePaper
Homeతెలంగాణఎస్‌జీఎఫ్ క్రికెట్‌లో సాక్షిత్ రావు అద్భుత ప్రతిభ.రెండు ఓవర్లలో మూడు వికెట్లు.. ఏడు పరుగులే ఇచ్చి...

ఎస్‌జీఎఫ్ క్రికెట్‌లో సాక్షిత్ రావు అద్భుత ప్రతిభ.రెండు ఓవర్లలో మూడు వికెట్లు.. ఏడు పరుగులే ఇచ్చి ప్రత్యర్థి జట్టుకు కట్టడి

📰 Generate e-Paper Clip

ఎస్‌జీఎఫ్ క్రికెట్‌లో సాక్షిత్ రావు అద్భుత ప్రతిభ.రెండు ఓవర్లలో మూడు వికెట్లు.. ఏడు పరుగులే ఇచ్చి ప్రత్యర్థి జట్టుకు కట్టడి,

అర్జున్ సమాచారం // అక్టోబర్ 14 // రామగిరి రిపోర్టర్:

స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్‌జీఎఫ్) క్రికెట్ పోటీల్లో రామగిరి మండలం రత్నాపూర్ గ్రామానికి చెందిన యువ క్రికెటర్ పల్లె సాక్షిత్ రావు తన బౌలింగ్‌తో సత్తా చాటాడు. పెద్దపల్లి జిల్లా ఎన్‌టీపీసీలో నిర్వహించిన ఎస్‌జీఎఫ్ క్రికెట్ పోటీల్లో పెద్దపల్లి జిల్లా అండర్‌-17 జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న సాక్షిత్ రావు అద్భుత ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించాడు.

కరీంనగర్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో సాక్షిత్ రావు కేవలం రెండు ఓవర్లు బౌలింగ్ చేసి ఏడు పరుగులు మాత్రమే ఇచ్చి మూడు కీలక వికెట్లు పడగొట్టాడు. అంతేకాకుండా ప్రత్యర్థి జట్టు ఆటగాడిని రన్‌అవుట్ చేయడంలోనూ కీలక పాత్ర పోషించాడు. తక్కువ పరుగులు ఇచ్చి వికెట్లు సాధించడంతో పాటు ఫీల్డింగ్‌లోనూ చురుకుదనం ప్రదర్శించి జట్టుకు తనవంతు సహకారం అందించాడు.

ప్రస్తుతం సాక్షిత్ రావు కమాన్‌పూర్ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. చదువుతోపాటు క్రికెట్‌పై ఆసక్తిని పెంచుకుంటూ జిల్లా అండర్‌-17 జట్టుకు నాయకత్వం వహించడం విశేషం. చిన్న వయసులోనే తన ప్రతిభను చాటుకుంటూ క్రికెట్‌లో ముందుకు సాగుతున్న సాక్షిత్ రావు ప్రదర్శనపై క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

సాక్షిత్ రావు ప్రతిభను గుర్తించిన ఎస్‌జీఎఫ్ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి కనుకుంట్ల లక్ష్మణ్, మాజీ కార్యదర్శి కొమురోజు శ్రీనివాస్, కోచ్ ఎం. సుదేశ్, సురేష్ అకాడమీ కోచ్ ఎం. సురేష్, హేమంత్, అనిల్ రెడ్డి తదితరులు అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి ఉన్నత స్థాయి క్రికెటర్‌గా ఎదగాలని ఆకాంక్షించారు.

రత్నాపూర్ గ్రామానికి చెందిన యువకుడు జిల్లా జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తూ క్రికెట్‌లో ప్రతిభ కనబరచడం గ్రామానికి గర్వకారణమని స్థానికులు పేర్కొంటున్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!