మహిళలకు రక్షణ కల్పించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది: బీజేపీ మహిళా మోర్చా.
విద్యార్థినులకు న్యాయం చేయాలని డిమాండ్.. భీమోల్, రాహుల్ గాంధీ దిష్టిబొమ్మల దహనం,
అర్జున్ సమాచారం // అక్టోబర్ 13 // మంచిర్యాల ప్రతినిధి:
మహిళలు, విద్యార్థినులపై జరుగుతున్న లైంగిక వేధింపుల ఘటనలకు నిరసనగా మంచిర్యాల జిల్లా బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు పచ్చ స్వప్నరాణి నాయకత్వంలో కాంగ్రెస్ ఎంపీ అంగోంచ భీమోల్, రాహుల్ గాంధీ దిష్టిబొమ్మలను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా పచ్చ స్వప్నరాణి మాట్లాడుతూ, విద్యార్థినులపై లైంగిక వేధింపులకు సంబంధించిన ఆరోపణల నేపథ్యంలో బాధిత విద్యార్థులకు న్యాయం జరగాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై సంబంధిత నాయకత్వం స్పందించాలని, అంగోంచ భీమోల్ను కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కోరారు. మహిళలకు, విద్యార్థినులకు భద్రత కల్పించడంలో ప్రభుత్వాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీ పాలనలో మహిళలకు రక్షణ లేదని విమర్శిస్తూ, మహిళలపై అఘాయిత్యాలను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ మహిళా మోర్చా నాయకులు డిమాండ్ చేశారు.
ఈ నిరసన కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా మహిళా మోర్చా నాయకులు, మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు.

