కార్మికుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట.సింగరేణి కార్మికులకు లాభాల వాటా ప్రకటన.ప్రజా భవన్‌లో నిర్వహించిన పాత్రికేయ సమావేశంలో పాల్గొన్న రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్.
గోదావరిఖని:అర్జున్ సమాచారం ప్రతినిధి అక్టోబరు 13.
సింగరేణి లాభాల్లో కార్మికులకు 34 శాతం వాటా..కాంట్రాక్ట్ కార్మికులకు రూ.5,500 బోనస్,15 రోజుల్లో పెండింగ్ ఉద్యోగాల సమస్య పరిష్కారానికి చర్యలు..
కార్మికుల పిల్లలకు న్యాయం చేస్తామని ప్రకటించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
సింగరేణి కార్మికుల సంక్షేమం, వారి కుటుంబాల అభివృద్ధి, కార్మికుల పిల్లలకు ఉద్యోగ అవకాశాల కల్పనే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోందని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా ఈరోజు ప్రజా భవన్‌లో నిర్వహించిన పాత్రికేయ సమావేశంలో రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క , రాష్ట్ర ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు , ప్రభుత్వ విప్ చింతకుంట విజయ రమణ రావు గl, ఎమ్మెల్యేలు ప్రేమసాగర్ రావు గండ్ర సత్యనారాయణ రావు తదితర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి ఈ సమావేశంలో పాల్గొని సింగరేణి కార్మికులకు సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు.
సింగరేణి లాభాల్లో కార్మికులకు 34 శాతం వాటా
సింగరేణి సంస్థ సాధించిన లాభాల్లో కార్మికులకు వాటా ప్రకటించడం ద్వారా వారి శ్రమకు తగిన గుర్తింపు కల్పించే దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మొత్తం రూ.1,754 కోట్ల లాభాల నేపథ్యంలో కార్మికులకు 34 శాతం వాటాను ప్రకటించారు. సంస్థ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న కార్మికులకు లాభాల్లో వాటా అందించడం వారి కష్టానికి తగిన గౌరవాన్ని అందించడమే కాకుండా, వారి కుటుంబాల ఆర్థిక భద్రతకు కూడా దోహదపడనుంది.
సింగరేణి సంస్థలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు సైతం ప్రభుత్వం శుభవార్త అందించింది. కాంట్రాక్ట్ కార్మికులకు రూ.5,500 బోనస్ ప్రకటించడం ద్వారా వారి సంక్షేమం పట్ల ప్రభుత్వం తన నిబద్ధతను చాటుకుంది. సంస్థ అభివృద్ధిలో రెగ్యులర్ కార్మికులతో పాటు కాంట్రాక్ట్ కార్మికుల పాత్ర కూడా కీలకమని గుర్తిస్తూ వారికి ప్రయోజనాలు కల్పించే దిశగా నిర్ణయాలు తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.

