రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలకు ఎంపికైన తుగ్గలి బాలిక వర్షిని,బౌలింగ్‌లో ప్రతిభ చాటి జిల్లా జట్టులో చోటు.క్రీడాకారిణికి సాధన విద్యానికేతన్ కరస్పాండెంట్ అభినందనలు.
తుగ్గలి: అర్జున్ సమాచారం డెస్క్ అక్టోబరు 13.
కర్నూలులో బాల సాయిబాబా స్కూల్ ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించిన అండర్–17 బాలికల క్రికెట్ పోటీల్లో ప్రతిభ కనబరిచిన తుగ్గలి గ్రామానికి చెందిన ఈడిగ వర్షిని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైంది.ఈనెల మచిలీపట్నంలో జరగనున్న రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీల్లో పాల్గొనేందుకు కర్నూలు జిల్లా జట్టును ఎంపిక చేయగా,వర్షిని బౌలింగ్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి జిల్లా జట్టులో స్థానం సంపాదించింది.తుగ్గలి గ్రామానికి చెందిన ఈడిగ వాటర్ రామంజి,భారతి దంపతుల కుమార్తె అయిన వర్షిని,పత్తికొండలోని సెయింట్ జోసెఫ్ పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది.గత సంవత్సరం నుంచి ప్రతిరోజూ ఉదయం,సాయంత్రం సాధన విద్యానికేతన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్‌లో క్రికెట్‌లో ప్రత్యేక శిక్షణ పొందుతూ తన ప్రతిభను మెరుగుపరుచుకుంది.నిరంతర సాధన,కృషి,పట్టుదలతో రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక కావడం విశేషం.ఈ సందర్భంగా వర్షిని మాట్లాడుతూ,గత సంవత్సరం నుంచి సాధన విద్యానికేతన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్‌లో బౌలింగ్ సాధన చేసి జిల్లా స్థాయిలో ఎంపిక కావడం చాలా సంతోషకరమని వర్షిని తెలియజేశారు.నాకు ఇంతగా సహకరించిన తల్లిదండ్రులకు, సాధన స్కూల్ కరస్పాండెంట్ దండు భాస్కర్ కు వర్షిని కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా సాధన స్కూల్ కరస్పాండెంట్ దండు భాస్కర్ మాట్లాడుతూ జిల్లా స్థాయి క్రికెట్ పోటీలకు ఎంపికైన వర్షిని కు అభినందనలు తెలియజేశారు.అదేవిధంగా వర్షిని అంచలంచెలుగా ఎదిగి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర,దేశ క్రికెట్ నందు ప్రతిభ చాటాలని ఆయన తెలియజేశారు.ఈ సందర్భంగా గ్రామ ప్రజలు,యువకులు వర్షినీకు అభినందనలు తెలియజేశారు.

