ePaper
Wednesday, November 11, 2026
ePaper
Homeఎడిటోరియల్విశ్వాసం, గౌరవమే వివాహ వ్యవస్థకు మూలం.

విశ్వాసం, గౌరవమే వివాహ వ్యవస్థకు మూలం.

📰 Generate e-Paper Clip

విశ్వాసం, గౌరవమే వివాహ వ్యవస్థకు మూలం.

విశ్లేషణ) అర్జున్ సమాచారం డెస్క్ నవంబర్ 12,

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం సృష్టించి ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్, ఇప్పుడు తన మూడవ భార్యకు విడాకులు ఇచ్చి దూరంగా ఉంటున్నారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ విడాకుల గురించే మాట్లాడుకుంటున్నారు. సోషల్ మీడియా, టీవీ చానళ్లు, వెబ్ సైట్లు ఒకటేంటి అన్నీ చోట్ల ఏపీ డిప్యూటీ సీఎం ముచ్చటగా మూడో పెళ్లిని కూడా రద్దు చేసుకోవడం ఏంటని ఆశ్చర్యపోతున్నారు.2026 నవంబర్ 9 రాత్రి పవన్ కళ్యాణ్, అనా లెజ్‌నెవా విడిపోతున్నట్టు ప్రకటించారు. అభిమానులకు ఈ ప్రకటన షాకిచ్చింది. సనాతన ధర్మం గురించి మాట్లాడే పవన్ కళ్యాణ్ ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన ప్రసంగాల్లో సనాతన ధర్మ పరిరక్షణ గురించి ప్రస్తావిస్తుంటారు. అయితే సనాతన ధర్మం గురించి మాట్లాడే వ్యక్తులు తమ వ్యక్తిగత జీవితంలో ధర్మవిలువలు పాటిస్తున్నారా? పవన్ కళ్యాణ్ మమూడు పెళ్లిళ్లు.. మూడో భార్యతో విడాకుల వ్యవహారంతో మరోసారి చర్చనీయాంశమైంది.1997లో నందినిని వివాహం చేసుకున్న పవన్ కళ్యాణ్ 2008లో విడాకులు తీసుకున్నారునటి రేణుదేశాయ్ లో సహజీవనం చేసి 2009లో పెళ్లిచేసుకున్నారు..వీరికి ఇద్దరు పిల్లలు.. 2012లో విడిపోయారు.రష్యాకు చెందిన అనా లెజ్‌నెవాని 2013లో వివాహం చేసుకున్నారు..వీరికి ఇద్దరు పిల్లలున్నారు..లేటెస్ట్ గా పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్టు ప్రకటించారుతమ వైవాహిక బంధం ముగిసినప్పటికీ పిల్లల బాధ్యతలు కలసి నిర్వహిస్తామని తెలిపారు.  సనాతన ధర్మం అంటే శాశ్వతమైన ధర్మం లేదా ఎప్పటికీ నిలిచే జీవన విలువలు అని అర్థం. ఇది కేవలం మతపరమైన నినాదం కాదు.. సత్యం, ధర్మం, అహింస, దయ, కరుణ, ఇంద్రియ నిగ్రహం, పరులకు హాని చేయకపోవడం లాంటి విలువలకు సనాతన ధర్మంలో ప్రాధాన్యత ఉంది. ధర్మం అంటే కేవలం పూజ చేయడం, దేవాలయాలు సందర్శించడం, ఆచారాలు పాటించడం మాత్రమే కాదు.. మనిషి తన బాధ్యతలు నిజాయితీగా నిర్వహించడం, ఇతరుల హక్కులు గౌరవించడం, కుటుంబాన్ని బాధ్యతతో నడిపించడం కూడా ధర్మంలో భాగమే.  హిందూ సంప్రదాయంలో వివాహాన్ని పవిత్రమైన సంస్కారంగా భావిస్తారు. ప్రాణి భూమ్మీద పడినప్పటి నుంచి మరణించే వరకూ ముఖ్యమైన 16 సంస్కారాలు అనుసరిస్తారు. వాటిలో వివాహం కూడా ఒకటి. అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకుని ఆఖరిక్షణం వరకూ ఆమెతోనే కలసి బతకాలన్నది శాస్త్రవచనం. పవన్ కళ్యాణ్ మొదటి భార్య నందిని. వారిద్దరూ ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. అయితే, పవన్, నందినిల మధ్య ప్రేమ ఎక్కువ కాలం నిలవలేదు. నందిని కూడా విశాఖపట్నంలోని ఒక సంపన్న కుటుంబానికి చెందినది. మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండానే రెండో పెళ్లి చేసుకున్నాడని ఆమె ఆరోపించింది. విశాఖపట్నం కుటుంబ న్యాయస్థానానికి వాంగ్మూలం ఇచ్చిన పవన్ కళ్యాణ్, తాను రేణు దేశాయ్‌ను వివాహం చేసుకోలేదని చెప్పారు. ఆ తర్వాత, పవన్ కళ్యాణ్ విడాకుల కోసం దరఖాస్తు చేసుకోగా, 2008లో నందినికి రూ. 5 కోట్ల భరణం చెల్లించి విడాకులు పొందారు.తన మొదటి భార్యతో విడిపోయి, 2012లో, ఈ జంట విడాకులు తీసుకుని విడిపోయారు.అయితే పవన్ కళ్యాణ్ నుండి రేణు దేశాయ్ కోట్ల రూపాయల భరణం అందుకోలేదని సమాచారం. దానికి బదులుగా, పవన్ కళ్యాణ్ ప్రతి నెలా వారి ఇద్దరు పిల్లల పోషణ ఖర్చులను చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది. రేణు దేశాయ్ తన పేరు మీద కొన్ని ఆస్తులను రిజిస్టర్ చేయించుకున్నట్లు కూడా  సినీ వర్గాల్లో ఇన్ సైడ్ టాక్.తన రెండవ భార్య రేణు దేశాయ్‌తో విడాకులు తీసుకునే ముందు, పవన్ కళ్యాణ్ 2010లో ‘టీన్ మార్’ సినిమా షూటింగ్ కోసం రష్యా వెళ్లారు. అక్కడ ఆయన మోడల్ అన్నా లెజ్నోవాను కలిశారు. 2012లో రేణు దేశాయ్‌కు విడాకులు ఇచ్చిన పవన్ కళ్యాణ్, 2013 ప్రత్యేక వివాహ చట్టం కింద అన్నా లేజనోవాను వివాహం చేసుకున్నారు. ఇప్పుడు ఆయన మూడవ వివాహం కూడా విడాకుల బాట పట్టింది. అన్నాతో పవన్ కళ్యాణ్ 13 ఏళ్ల వైవాహిక జీవితానికి తెరదించారు.కొందరు మాత్రం పవన్ కళ్యాణ్ విడాకులు తీసుకోవడానికి ఓ బలైమన కారణం ఉందంటూ పోస్ట్‌లు పెడుతున్నారు. అందులో మరీ ముఖ్యంగా తన రాజకీయపాలన కోసమే ఈ పని చేసినట్లు పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రజలకు సేవ చేయాలన్న ఒకే ఒక్క కారణంతో తన కుటుంబానికి దూరంగా ఉండాలనుకున్నాడని.. అందుకోసమే విడాకులు తీసుకున్నాడని పెద్ద ఎత్తున పోస్ట్‌లు పెడుతున్నారు. నిజంగానే ఈ కారణంతోనే విడాకులు తీసుకున్నాడా? లేదంటే ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నాయా? అనేది క్లారిటీ లేదు.ఇందులో నిజమెంతుందో పక్కన పెడితే ఈ టైమ్‌లో పవన్ కళ్యాణ్ విడాకులు తీసుకోవడం తన పొలిటికల్ కెరీర్‌కు మరో మచ్చలా మిగిలిపోతుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే చాలా మంది మాత్రం అది వాళ్ల పర్సనల్ లైఫ్.. విడాకులు తీసుకుంటారో, కలిసుంటారో అన్నది వాళ్ల ఛాయిస్. వాళ్ల డెసిషన్‌కు రెస్పెక్ట్ ఇవ్వాలి కానీ… ఇంకా బురద జల్లే ప్రయత్నాలు చేయడం సరికాదు అంటూ పోస్ట్‌లు పెడుతున్నారు.భార్యాభర్తలు పరస్పర విశ్వాసం, గౌరవం, బాధ్యతతో జీవించాలని వివిధ ధర్మశాస్త్రాలు, సంప్రదాయాలు బోధిస్తాయి. వివాహం విఫలం అయితే జీవితాంతం బాధను భరించాలనే నియమమం సనాతన ధర్మంలో ఉందని చెప్పలేం. పెళ్లి, విడాకులు, పునర్వివాహాల విషయంలో హిందూ సంప్రదాయాల్లో భిన్నమైన అభిప్రాయాలు, ఆచారాలు ఉన్నాయి. ఆధునిక భారతీయ చట్టం కూడా విడాకులు, పునర్వివాహాలకు అవకాశం కల్పిస్తోంది. ఓ వ్యక్తి ఎన్ని వివాహాలు చేసుకున్నారనే సంఖ్య ఆధారంగా మాత్రమే వారి ధార్మికతను నిర్ణయించడం సరైన పద్ధతి కాదు. అదే సమయంలో ప్రతి వివాహంలోనూ భాగస్వామ్య గౌరవం, పిల్లల సంక్షేమం, కుటుంబ బాధ్యతలను ప్రాధాన్యత ఇవ్వడం అవసరం.ఆధ్యాత్మిక దృక్పథంలో చూస్తే వ్యక్తిగత జీవితంపై తీర్పు చెప్పడం కన్నా ఆ వ్యక్తి ప్రవర్తనలో ధర్మ విలువలు ఎంతవరకు ప్రతిబింబిస్తున్నాయో పరిశీలించడం ముఖ్యం. వివాహ బంధం కొనసాగపోవడానికి ఎన్నో వ్యక్తిగత కారణాలు ఉండొచ్చు. పూర్తి కారణాలు తెలియకుండా తప్పొప్పులు చెప్పడం సముచితం కాదంటారు ఆధ్యాత్మికవేత్తలు. సనాతన ధర్మం గురించి ప్రజలకు సందేశాలు ఇచ్చేనాయకులు తమ జీవితాల్లో సత్యం, నిబద్ధత, బాధ్యత, పరస్పర గౌరవం వంటి విలువలకు ప్రాధాన్యత ఇవ్వాలని అంతా ఆశించడం సహజం.  సనాతన ధర్మం అంటే ఇతరులకు చెప్పేందుకు ఉపయోగించే నినాదం కాదు..అది మనిషి తన జీవితంలో ఆచరించాల్సిన విలువల సమాహారం. రాజకీయ నాయకుడు అయినా, ఆధ్యాత్మికవేత్త అయినా, సామాన్యుడు అయినా ధర్మం ముందు బాధ్యత ఒక్కటే. ధర్మం మాటల్లో కనిపించడం కన్నా చేతల్లో చూపించినప్పుడే సందేశం విలువ పెరుగుతుంది.. 

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!