ePaper
Wednesday, November 11, 2026
ePaper
Homeఎడిటోరియల్ఎల్ నినో కేంద్రసాయం ఎక్కడ.

ఎల్ నినో కేంద్రసాయం ఎక్కడ.

📰 Generate e-Paper Clip

ఎల్ నినో కేంద్రసాయం ఎక్కడ.
విశ్లేషణ) అర్జున్ సమాచారం డెస్క్ నవంబర్ 10.
ప్రకృతి ప్రకోపిస్తే పంటలు ఎండిపోతాయి. వర్షాలు ముఖం చాటేస్తే పొలాలు బీళ్లుగా మారతాయి. కానీ ప్రకృతి వైపరీత్యాల కంటే ప్రభుత్వాల నిర్లక్ష్యం రైతులను ఎక్కువగా కుంగదీస్తుంది. ఎల్ నినో పరిస్థితులు దేశవ్యాప్తంగా వ్యవసాయ రంగాన్ని తీవ్ర ప్రభావితం చేస్తున్నాయి. పంటలు చేతికందక రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతుంటే, పాలకుల ప్రకటనలు మాత్రం కాగితాలకే పరి మితమవుతున్నాయనే విమర్శలున్నాయి.రైతు నష్టపోతున్నాడు. వ్యవసాయం సంక్షోభంలో పడుతోంది. పేద కుటుంబాల బడ్జెట్ తలకిందులవుతోంది. అయి నా కేంద్రం నుంచి స్పష్టమైన కార్యాచరణ ఎక్కడ? రైతు కన్నీటికి విలువ లేదా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. తెలంగాణలో 365 మండలాలను కరు వు ప్రాంతాలుగా ప్రకటించి రూ.30 వేల కోట్ల ఆర్థిక సాయం కేంద్రాన్ని కోరినట్లు నివేదికలు వెల్లడించాయి. ఆంధ్రప్రదేశ్‌లో 388 మండలాలు కరువు ఎదుర్కొంటున్నాయి. కర్ణాటకలో 57.93 లక్షల హెక్టా ర్లలో పంట నష్టం జరిగినట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం అంచనా. నష్టం విలువ రూ.62 వేల కోట్లకు పైగా ఉంటుందని పేర్కొంది. ఇవి ఆయా రాష్ట్రాలు వెల్లడించిన గణాంకాలు మాత్రమే. దేశంలోని అన్ని రాష్ట్రాల కు సంబంధించిన నష్టాలపై ఒకే విధమైన తుది కేంద్ర నివేదిక ప్రజల ముందుకు రావాల్సి ఉంది. రాష్ట్రాలు నిధులు కోరడం, కేంద్రం పరిశీలిస్తామని చెప్పడం, అధికారులు నివేదికలు తయారు చేయడం.. ఈ తంతు పూర్తయ్యేసరికి రైతు చేతిలో మిగిలేది అప్పులేనా? నష్టాన్ని అంచనా వేయ డానికే నెలలు పడితే రైతు కుటుంబాలు ఎలా జీవించాలి?రైతు ఎకరాకు పెట్టే పెట్టుబడి రోజురోజుకూ పెరుగుతోంది. విత్తనాలు, ఎరువు లు, పురుగుమందులు, కూలీల ఖర్చులు ఆకాశాన్నంటుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పంట పూర్తిగా నష్టపోతే ఇచ్చే పరి మిత పరిహారం రైతును ఎలా ఆదుకుంటుంది? నష్టాన్ని అంచనా వేసే విధానం పారదర్శకంగా ఉండాలి. భూమి యజమానులకే కాకుండా కౌలు రైతులకు కూడా న్యాయం జరగాలి. పంటల బీమా పరిహారాన్ని నెలల తరబడి పెండింగ్లో పెట్ట కుండా తక్షణమే చెల్లించాలి. వ్యవసాయ రుణాల వసూళ్లను వాయిదా వేయాలి. తదుపరి పంట సాగుకు పెట్టుబడి సాయం అందించాలి. కరువు ప్రభావం పొలాలకే పరిమితం కాదు. పంటల దిగుబడులు తగ్గితే ఆహార ధాన్యాల ధరలు పెరిగే ప్రమాదం ఉంది. రైతు ఆదాయం పడిపోతుంది. కూలీలకు పనులు తగ్గుతాయి. చివరకు పేద, మధ్యతరగతి కుటుంబాల వంటగదిపై ధరల భారం పడుతుంది. ప్రస్తుతం ప్రజా పంపి ణీ వ్యవస్థ ద్వారా అర్హులైన కుటుంబాలకు బియ్యం, గోధుమలు ఉచితంగా అందుతున్నాయి. కానీ బియ్యం ఒక్కటే కుటుంబా నికి సంపూర్ణ ఆహార భద్రత కల్పించదు. కందిపప్పు, శనగపప్పు, వంటనూనె, చక్కెర వంటి నిత్యావసర సరుకులను కూడా సబ్సిడీపై అందించాల్సిన అవసరం ఉంది.  కేంద్రం కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రకటించిన ప్రణాళికలు క్షేత్రస్థా యిలో అమలుకావాలి. నీటి సంరక్షణ, చెరువుల పునరుద్ధరణ, కాలువల మరమ్మతులు, భూగర్భ జలాల పెంపునకు ప్రత్యేక నిధులు కేటాయించాలి. తక్కువ నీటితో పండే పంటలకు ప్రోత్సాహం ఇవ్వాలి. విత్తనాలు, ఎరువులు అందించాలి. పశువులకు పశుగ్రాసం,గ్రామాలకు తాగునీరు అందిం చాలి. ఉపాధి పనులను విస్తరించి గ్రామీణ కుటుంబాలకు ఆదాయం కల్పించాలి. కరువు అనేది ఏ ఒక్క పార్టీకి, ఏ ఒక్క రాష్ట్రానికి సంబంధించిన సమస్య కాదు. ఇది దేశ ఆహార భద్రతకు సంబంధించిన సంక్షోభం. ఇలాంటి సమయంలో రాజకీయ విభేదాలు, నిధుల విషయంలో వివక్ష, అధికారుల కాలయాపనకు తావుండకూడదు. కేంద్రం రాష్ట్రాలకు అండగా నిలవాలి. రాష్ట్రాలు రైతులకు నేరుగా సహా యం అందించాలి. ప్రకటించిన పథకాల అమలుపై నిరంతర పర్యవేక్షణ ఉండాలి.ప్రకృతి వైపరీత్యాలను ఆపడం ప్రభుత్వాల చేతుల్లో ఉండకపోవచ్చు. కానీ వాటి ప్రభావంతో ప్రజలు ఆకలితో అలమటించకుండా చూడటం మాత్రం ప్రభుత్వాల చేతుల్లోనే ఉంది. రైతు పంట పండిస్తేనే దేశానికి అన్నం అందుతుంది. రైతు నష్టపోతే దేశ ఆర్థిక వ్యవస్థపైనా ప్రభావం పడుతుంది. ప్రకటనలతో రైతు కడుపు నిండదు.అప్పులు తీరవు. సమీక్షలతో పం టలు పండవు. కేంద్రం ఇప్పటికైనా మేల్కొనాలి. నష్టాలపై సమగ్ర నివేదిక విడుదల చేయాలి. తక్షణమే నిధులు మంజూరు చేయాలి. రైతులకు న్యాయమైన పరిహారం అందించాలి. పేదలకు నిత్యావసర సరుకులను సబ్సిడీ ధరలకు పంపిణీ చేయాలి. రైతు కన్నీరు తుడవని పాలనకు ప్రజల సమస్యలు పరిష్కరించిన ఘనత ఎలా దక్కుతుంది? రైతుకు భరోసా.. పేదలకు ఆహార భద్రత.. ఇవి హామీలు కాదు, ప్రభుత్వాలు నెరవేర్చాల్సిన కనీస బాధ్యతలు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!