ePaper
Saturday, November 21, 2026
ePaper
Homeతెలంగాణవరంగల్పసుపు ధర సరికొత్త రికార్డు.

పసుపు ధర సరికొత్త రికార్డు.

📰 Generate e-Paper Clip

పసుపు ధర సరికొత్త రికార్డు.

వరంగల్, నవంబరు 19, (అర్జున్ సమాచారం డెస్క్).

తెలంగాణ పసుపు రైతులకు ఊరటనిచ్చే పరిణామం చోటుచేసుకుంది. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం వ్యవసాయ మార్కెట్‌లో పసుపు ధర సరికొత్త రికార్డు సృష్టించింది. క్వింటాల్ పసుపు గరిష్ఠంగా రూ.19,253 పలకడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్‌లో జరిగిన ఈ-వేలంలో నాణ్యమైన పసుపు కోసం వ్యాపారుల మధ్య పోటీ నెలకొనడంతో ధర ఒక్కసారిగా పెరిగింది. ఈ నెల 22వ తేదీన నమోదైన గరిష్ఠ ధర రూ.13,319తో పోలిస్తే తాజా వేలంలో ఏకంగా రూ.6 వేల వరకు పెరుగుదల కనిపించింది. మార్కెట్ చరిత్రలోనే క్వింటాల్ పసుపునకు ఈ స్థాయిలో ధర లభించడం విశేషంగా నిలిచింది.కేసముద్రం వ్యవసాయ మార్కెట్‌లో సోమవారం నిర్వహించిన ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ (ఈ-నామ్) ఈ-వేలంలో కాడి, గోళ రకం పసుపును రైతులు విక్రయానికి తీసుకొచ్చారు. మొత్తం 10 మంది రైతులు 99 బస్తాల పసుపును మార్కెట్‌కు తీసుకువచ్చారు. ఇందులో ఏడుగురు రైతులు 69 బస్తాల కాడి రకం పసుపును.. ముగ్గురు రైతులు 30 బస్తాల గోళ రకం పసుపును విక్రయానికి ఉంచారు. ఈ వేలంలో కాడి రకం పసుపునకు అత్యధికంగా క్వింటాల్‌కు రూ.19,253 ధర లభించింది. కనిష్ఠ ధర రూ.15,589గా నమోదైంది. సగటు ధర రూ.19,252గా ఉన్నట్లు మార్కెట్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.గోళ రకం పసుపు విషయానికి వస్తే గరిష్ఠ ధర క్వింటాల్‌కు రూ.18,566 పలికింది. కనిష్ఠ ధర రూ.8,506గా నమోదవగా.. సగటు ధర రూ.17,469గా ఉంది. రకం, నాణ్యతను బట్టి ధరల్లో వ్యత్యాసం కనిపించినప్పటికీ.. మొత్తంగా మార్కెట్‌లో పసుపునకు మంచి ధరలు లభించడం రైతుల్లో ఆశలు పెంచింది. కేసముద్రం మార్కెట్‌లో పసుపు ధరల పెరుగుదల రైతుల్లో చర్చనీయాంశంగా మారింది. మార్కెట్‌కు వచ్చిన పసుపు నాణ్యత మెరుగ్గా ఉండటంతో వ్యాపారులు కొనుగోలుపై ఆసక్తి చూపినట్లు తెలుస్తోంది పసుపు ధరలు తక్కువ స్థాయిలోనే ఉన్నాయి. ఆ రోజు కాడి రకానికి గరిష్ఠంగా రూ.11,609.. కనిష్ఠంగా రూ.7,011 లభించగా, గోళ రకానికి గరిష్ఠంగా రూ.10,511, కనిష్ఠంగా రూ.7,011 నమోదయ్యాయి. ఆ ధరలతో పోలిస్తే తాజాగా ధరలు గణనీయంగా పెరిగాయి. కేసముద్రం మార్కెట్‌లో అమలవుతున్న ఈ-నామ్ విధానం ద్వారా వ్యాపారులు ఆన్‌లైన్‌లో బిడ్లు దాఖలు చేసి పంటను కొనుగోలు చేస్తున్నారు. ఈ విధానం ద్వారా కొనుగోళ్లలో పారదర్శకత పెరగడంతో పాటు పంట నాణ్యతను బట్టి ధర నిర్ణయించే అవకాశం ఉంటుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
తాజా వేలంలో నాణ్యమైన పసుపునకు అధిక ధర లభించడానికి మార్కెట్‌కు వచ్చిన సరుకు నాణ్యత ఒక ముఖ్యమైన కారణంగా కనిపిస్తోంది. కొనుగోలుదారుల మధ్య పోటీ కూడా ధర పెరుగుదలకు కారణమైందని మార్కెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. మరోవైపు రాష్ట్రంలోని పసుపు సాగు చేసే ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితులు, నీటి కొరత పంట దిగుబడిపై ప్రభావం చూపినట్లు రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్, జగిత్యాల, నిర్మల్, మహబూబాబాద్ వంటి ప్రాంతాల్లో పంట ఎదుగుదల, దుంపల పరిమాణం వంటి అంశాలు దిగుబడిని ప్రభావితం చేయవచ్చు. ధరలు పెరగడం రైతులకు ఊరటనిచ్చినా.. పంట దిగుబడి తగ్గిన వారికి మొత్తం ఆదాయం తగ్గనుంది.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!