ePaper
Friday, August 21, 2026
ePaper
Homeక్రైమ్ న్యూస్లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన గ్రామపంచాయతీ కార్యదర్శి

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన గ్రామపంచాయతీ కార్యదర్శి

📰 Generate e-Paper Clip

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన గ్రామపంచాయతీ కార్యదర్శి

అర్జున సమాచారం చెన్నూరు నియోజకవర్గం ప్రతినిధి ఆగస్టు 21

మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. లింగయ్యపల్లె గ్రామపంచాయితీ కార్యదర్శి వరలక్ష్మి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు.
ఓ వ్యక్తి ఇంటి నిర్మాణానికి అనుమతి కోసం రూ.11 వేలు లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. లంచం తీసుకుంటున్న సమయంలో ఏసీబీ అధికారులు పంచాయతీ కార్యదర్శి వరలక్ష్మిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నట్లు సమాచారం.
లంచం మొత్తాన్ని స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు.. పంచాయతీ కార్యదర్శిపై కేసు నమోదు చేసి తదుపరి చర్యలు చేపడుతున్నారు. ఈ ఘటనతో జన్నారం మండలంలో కలకలం రేగింది..

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!