ePaper
Sunday, July 5, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్దేశములో దొంగలు పడ్డారు అయోధ్య రాముని పేరుతో దోపిడీ సుప్రీంకోర్టు...

దేశములో దొంగలు పడ్డారు అయోధ్య రాముని పేరుతో దోపిడీ సుప్రీంకోర్టు న్యాయ మూర్తి తో విచారణ జరిపించాలి బీజేపీ అవాస్తవాలు ప్రచారం అప్పుల ఆంధ్రగా ఏ పీ జి ల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చే యాలి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలకు సిద్ధం కావాలి

📰 Generate e-Paper Clip

ఎమ్మిగనూరు,అర్జున్ సమాచారం:
బీజేపీ నేతలు అయోధ్య రాముడు ను కూడా వదలడం లేదని ఆలయ నిర్మాణం పేరుతో కోట్లు వసూళ్లు చేసి దోచుకున్నారని విషయం బయటకు పొక్కడంతో సామాన్యులను అరెస్ట్ చేసి చేతులు దులుపుకొనే ప్రయత్నం చేస్తున్నారని అసలు నిందితులను అరెస్టు చేయ్యాలని  సీపీఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చే శారు  శనివారం సిపిఐ శ్రేణులు భారీ మోటర్ ర్యాలీ తో స్వాగతం పలుకుతూ ఫ్రెండ్స్ ఫంక్షన్ హాల్ కు రావడం జరిగింది. ఎమ్మిగనూరు లోని ఫ్రెండ్స్ ఫంక్షన్ హాలులో *సీపీఐ జిల్లా జనరల్ బాడీ సమావేశం సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు జీ. రంగన్న అధ్యక్షత వహించారు.
అంతకు ముందు సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి లె నిన్ బాబు సంతాప తీర్మానం ప్రవేశపెట్ట గా సమావేశం రెండు నిముషాలు మౌనం పాటించి సంతాపం తెలిపారు. అనంతరం రామకృష్ణ మాట్లాడుతూ   బిజెపి నాయకులు అయోధ్య రామాలయం నిర్మాణం పేరుతో భారత దేశం తో పాటు ఇతర దేశాలలో కూడా డబ్బులు వసూలు చేశారని ఆరోపించారు. ఒక వ్యక్తి తమ సంస్థ నుండి 39 కే జీ వెండి కూడా ఇచ్చి నట్లు తెలిపారన్నారు. బీజేపీ నేతలు డబ్బులు దోచుకున్నారని విమర్శించారు. దే వు నికే పంగ నామాలు పెట్టిన ఘనులని యద్దేవ చేశారు. భక్తుల మనోభావాలు దెబ్బ తి శారన్నారు. విగ్రహ ప్రతిష్ఠ మఠాధి పతులు, పీఠాధిపతు లు చే స్తారని అన్ని మోడీ చేతుల మీదుగా చెయ్యడం ఎమిటని ప్రశ్నించారు. వందలకోట్ల కుంభకోణం జరిగిన యావరు మాట్లాడటం లేదన్నారు.తిరుపతి వెంకన్న లడ్డులో నె య్యి కల్తీ జరిగింది అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లు పెద్ద ఎత్తున డిబే ట్లు చేసారని ఇప్పుడు యందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. మోడీ ప్రభుత్వం ప్రశ్నించే వారిపై సీబీఐ, ఈడి కేసు పెడు తుందని భయపడుతున్నారన్నారు. అధికారము లోకి వచ్చి 12 సం అయిన ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేసారో చెప్పాలన్నారు. విద్యార్థులు, రైతులు, సామాన్య ప్రజలు ఎవరు కూడా సుఖం గా లేరన్నారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేడు వు. సంవత్సరం కు రెండు కోట్ల ఉద్యోగాలు లేవు.నిత్యా వసర సరుకుల ధరలు తగ్గించ లేదన్నారు. అంతర్జాతీయ మార్కెట్ లో చమురు ధరలు తగ్గిన ఇక్కడ డీజిల్, పెట్రో ల్ ధరలు తగ్గిచ లే దన్నారు. ఈ ప్రభుత్వం ఆదాని, అంబానీ లకోసం పని చేస్తోందని సామాన్య ప్రజల కోసం కాదన్నారు. బీజేపీ ,ఆర్ ఎస్ ఎస్ లు ఏదో చే స్తున్నారు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. రాష్ట్ర ములో అవినీతి పెరిగి పోయిదాని, రాష్ట్రం అప్పుల ఆంధ్రగా మారిందన్నారు. చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో పదవి కోసం పెద్ద ఎత్తున హామీలు ఇచ్చి వాటిని అమలు చే య్యాడములో విఫలం అయ్యారన్నారు. ఆగస్టు. 6 నుండి 15 వరకు దేస వ్యాప్త పాదయాత్ర లను ,సెప్టెంబర్ 1 చలో  దిల్లీని విజయవంత చెయ్యాలన్నారు. అనంతరం  సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె రామాంజనేయులు మాట్లాడుతూ  జిల్లాలోని సాగు నీటి ప్రాజక్టు లు పూర్తి చెయ్యలన్నారు. ముఖ్య ముగా గుండ్రేవు ల , వేదవతి, ఆర్ డి ఎస్, హంద్రీ నివా సుజల స్రవంతి లాంటి ప్రాజెక్టులకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసి పూర్తి చెయ్యాలన్నారు. జిల్లాలో పశ్చిమ ప్రాంతంలో ఇప్పటికీ కరువు ఛాయలు అలుముకున్నాయన్నారు. ప్రతి ఏ డాది వలసలు తప్పడము లేయదన్నారు. కరోన తరువాత రద్దు చేసి న రైల్వే ప్యాసింజర్ రైలులు తిరిగి ప్రారంభించే దకు పోరాటాలు చేయవలసిన అవసరం ఉందన్నారు.  అనంతరం సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి రామచంద్రయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో అవినీతి పెరిగి పోయిందన్నారు. పోలీసులు ప్రజా ప్రతినిధులు కుమ్మక్కు అయి దోచు కుంటున్నారని ఆరోపించారు. ప్రభుత్వం పారిశ్రామిక వేత్తలకు ఎకరం భూమి 90 పైసలు ఇస్తుందని రైతులకు మాత్రం గిట్టుబాటు ధరలు కల్పించడము లేదన్నారు.పార్టీని బలోపేతం చేసి ఉద్యమాలకు సిద్ధం కావాలన్నారు. ఆవుల శేఖర్ మాట్లాడుతూ ప్రభుత్వం ఉపాధి హామీ చట్టం పాత విధానాన్ని అమలు చేయాలని కోరారు. కొత్త చట్టం వలన కార్మికులు ఇబ్బందు పడతారన్నారు. ఇప్పటికే వ్యవసాయ కూలీలు ఆందోళనలు చేపట్టారన్నారు. అనంతరం *సీపీఐ జిల్లా కార్యదర్శి గిడ్డయ్య మాట్లాడుతూ  జిల్లా సమగ్రాభివృద్ధికి సీపీఐ ఎన్నో పోరాటాలను చే సిందన్నారు. సాగు ,తాగు నీటి ప్రాజక్టు లకోసం పోరాటాలు చే సిందన్నారు. జిల్లాలో పెండింగ్ లో ఉన్న సాగు నీటి ప్రాజెక్టు లకు నిధులు మంజూరు చేసి పూర్తి కోసం ప్రభుత్వం పై పోరాటాలకు సిద్ధంగా ఉండాలని పార్టీ శ్రేనులకు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు నబీ రసూల్, మద్దిలే టి శెట్టి,రామకృష్ణారెడ్డి, చంద్రశేఖర్, రాజసాహబ్, భాస్కర్ యాదవ్ ,పంపన్న గౌడ్, శ్రీరాములు, శ్రీనివాసులు ,కారుమంచి, రాజు ,విరూపాక్షి ,శ్రావని, లలితమ్మ, తదితరులు పాల్గొన్నారు.
================================

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!