ePaper
Sunday, October 18, 2026
ePaper
Homeతెలంగాణహైదరాబాద్ఆపరేషన్ కవచ్ తనిఖీల్లో కంచన్‌బాగ్ రౌడీషీటర్ అదుపులోకి.. 170 వాహనాల తనిఖీ, 18 కేసులు నమోదు

ఆపరేషన్ కవచ్ తనిఖీల్లో కంచన్‌బాగ్ రౌడీషీటర్ అదుపులోకి.. 170 వాహనాల తనిఖీ, 18 కేసులు నమోదు

📰 Generate e-Paper Clip

హైదరాబాద్:అర్జున్ సమాచారం:
హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆపరేషన్ కవచ్ కార్యక్రమంలో భాగంగా పోలీసులు అర్ధరాత్రి ప్రత్యేక వాహన తనిఖీలు నిర్వహించారు. షాహీన్ నగర్ మెయిన్ రోడ్డుపై చేపట్టిన ఈ తనిఖీల్లో మొత్తం 22 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.జాయింట్ సీపీ, షంషాబాద్ జోన్ డీసీపీ, ఆదిబట్ల ఏసీపీ, బాలాపూర్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ జి. నాగరాజు పర్యవేక్షణలో
ఎస్‌ఐ ఎం.ఎస్.ఆర్.వి. ప్రసాద్, ఎస్‌ఐ ఎం. నవీన్ కుమార్, బాలాపూర్ క్రైమ్ టీమ్, ఆర్మ్డ్ రిజర్వ్ సిబ్బంది ఈ తనిఖీలు చేపట్టారు.ఈ సందర్భంగా రాత్రి వేళల్లో రోడ్లపై తిరుగుతున్న వ్యక్తులు, హెల్మెట్ లేకుండా
వాహనాలు నడిపేవారు, సరైన వాహన పత్రాలు లేనివారిని పోలీసులు తనిఖీ చేశారు. మొత్తం 170 వాహనాలను తనిఖీ చేయగా, ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి 18 కేసులు నమోదు
చేశారు.ఈ తనిఖీల్లో కంచన్‌బాగ్ పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన రౌడీషీటర్ ఇలియాస్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ట్రాఫిక్ నిబంధనలను అమలు చేయడం, చట్టవిరుద్ధ కార్యకలాపాలను
అరికట్టడం, నగరంలో శాంతిభద్రతలను కాపాడటమే ఆపరేషన్ కవచ్ ప్రధాన ఉద్దేశమని పోలీసులు తెలిపారు. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, అవసరమైన పత్రాలను వెంట
ఉంచుకోవాలని, ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని పోలీసులు సూచించారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!