కీసర, అర్జున్ సమాచారం:
చీర్యాల పరిధిలోని జిన్నారం కాలనీలో మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ విసృతంగా పర్యటించారు.
ఈ సందర్భంగా కాలనీ లో నూతనంగా ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.
డివిజన్ లో ఉన్న త్రాగు నీటి సమస్య, వీధి దీపాలు, రేషన్ బియ్యం వంటి తదితర సమస్యలపై తొందరలోనే సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు కోల బలరాజ్ యాదవ్ , బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జిల్లాల తిరుమల్ రెడ్డి , చేర్యాల మాజీ సర్పంచ్ కోల అశోక్ యాదవ్ , జిల్లా కార్యవర్గ సభ్యులు ఏలూరు
సత్యనారాయణ , మాజీ వార్డు సభ్యులు శ్రీడొంకెనీ శాలిని రమేష్ గౌడ్ , బర్లపాటి ఆంజనేయులు, గ్రామ శాఖ అధ్యక్షులు కోల మల్లేష్ యాదవ్ , సీనియర్ నాయకులు ప్రభాకర్ రెడ్డి , జిన్నారం కాలనీ
అధ్యక్షులు సంపత్ , జిన్నారం వేణు, కిరణ్ , మహేష్ కాలనీలోని మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

