అమరావతి,అర్జున్ సమాచారం:
పంచాయతీ సర్పంచ్ ఏకగ్రీవాలపై హైకోర్టులో విచారణ జరిగింది. సర్పంచ్ ఏకగ్రీవాలపై న్యాయవాది జగ శ్రవన్ వ్యాజ్యం దాఖలు చేసారు. నోటా A ఆప్షన్ ఉన్న కారణంగా ఏ ఎన్నికను కూడా ఏకగ్రీవంగా ప్రకటించడానికి చట్టం అనుమతించలేదని జడ శ్రవణ్ వాదన. తక్షణమే ఏకగ్రీవంగా ఎన్నిక కాబడిన సర్పంచ్ ఎన్నికలను రద్దు చేసి ఎన్నిక నిర్వహించాలని అయన కోర్టుకు విన్నవించారు.
నోటా ఆప్షన్ అధికారికంగా బ్యాలెట్ పేపర్ల మీద ఉంది కదా అని ప్రశ్నించిన పిటిషనర్లు లేవనెత్తిన అంశాలపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ కమిషనర్, ప్రిన్సిపల్ సెక్రెటరీ మరియు ఎన్నికల కమిషన్ కు ఆదేశం జారీ చేసింది. విచారణ శుక్రవారానికి వాయిదా వేసింది.
==================

