ePaper
Saturday, November 28, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్అమరావతిఓటు హక్కు వినియోగించుకుంటే ప్రశ్నించే హక్కు ఉంటుంది చంద్ర‌బాబు నాయుడు

ఓటు హక్కు వినియోగించుకుంటే ప్రశ్నించే హక్కు ఉంటుంది చంద్ర‌బాబు నాయుడు

📰 Generate e-Paper Clip

అమరావతి,అర్జున్ సమాచారం:
ఉండవల్లి ఎంపీయూపీ స్కూల్‌లోని పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్న త‌రువాత ముఖ్యమంత్రి చంద్రబాబు మీడియాతో మాట్లాడారు.
రాష్ట్రంలో ఇవాళ 23 మున్సిపాలిటీలకు, పంచాయతీలకు తొలిదశ ఎన్నికలు జరుగుతున్నాయి. బాధ్యత కలిగిన పౌరులు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని అన్నారు.
ప్రజాస్వామ్యం మరింత బలపడాలంటే ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఓటు హక్కు వినియోగించుకుంటే ప్రశ్నించే హక్కు ఉంటుంది. భారత్‌లోని ప్రజాస్వామ్యం అత్యంత బలమైనది. భారతదేశం మరింతగా అభివృద్ధి జరిగేందుకు సమర్థంవంతమైన నాయకత్వం అవసరం. ఎన్నికల సమయంలో డబ్బు ప్రభావం లేకుండా ఓటు వేసే పరిస్థితి ఉండాలి. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం కోసం ప్రజలు ముందుకు రావాలి.  నేడు రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అంబేద్కర్ రాసిన రాజ్యాంగంతో భారత్‌కు దశ దిశా నిర్దేశం చేశారు. ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పించి ప్రజాస్వామ్య ఆయుధాన్ని ఇచ్చారు. పేద, ధనిక తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి. ప్రతి ఓటరు తమ హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!